కూసుమంచి, వెలుగు : కూసుమంచి మండలానికి రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో 100 పడకల ఆసుపత్రిని ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ శుక్రవారం కూసుమంచి రెవెన్యూ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు.
మండలంలో గట్టుసింగారం రెవెన్యూ పరిధిలోని కేజీబీవీ పక్కన ఉన్న సర్వే నంబర్ 12లో సర్వే చేసిన ల్యాండ్ 5.10ఎకరాలను శనివారం జిల్లా వైద్యాశాఖ ఆఫీసర్లకు అప్పగించనున్నట్లు రెవెన్యూ ఆఫీసర్లు తెలిపారు. దీంతో నేలకొండపల్లి, సూర్యాపేట జిల్లాలోని మోతే, ముదిగొండ మండలాల ప్రజలకు ఉపయోగకరంగా ఉండనుంది.