సోమనపల్లిలో ఇంటిగ్రేటెడ్​ స్కూల్​కు నిధులు మంజూరు

సోమనపల్లిలో  ఇంటిగ్రేటెడ్​ స్కూల్​కు నిధులు మంజూరు

చెన్నూరు, వెలుగు: చెన్నూరు మండలంలోని సోమనపల్లిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేసింది. నిర్మాణానికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గతంలోనే శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం నుంచి నిధుల మంజూరుకు కృషి చేశారు. ఈ నేపథ్యంలోనే చెన్నూరు క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్​తోపాటు ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకృష్ణ ఫొటోలకు కాంగ్రెస్​ నేతలు క్షీరాభిషేకం చేశారు.

బెల్లంపల్లిలోనూ ఇంటిగ్రేటెడ్​ స్కూల్​

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలో ఇంటిగ్రే టెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం రూ.200 కోట్ల నిధులు కేటాయిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. స్కూల్ నిర్మాణానికి బెల్లంపల్లి పట్టణంలోని గురిజాల శివారు సర్వే నంబర్ 394లో 9.20 ఎకరాలు, ఆకెనపల్లి శివారు సర్వే నంబర్లు 4, 5లో 15.20 ఎకరాలను రెవెన్యూ శాఖ కేటాయించింది. ఇప్పటికే ప్రధాన ఎడ్యుకేషన్ హబ్‌‌‌‌గా ఉన్న బెల్లంపల్లికి ఈ స్కూల్ మంజూరుతో మరింత ప్రాధాన్యత పెరిగింది. బెల్లంపల్లి అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని ఆయనకు ఎమ్మెల్యే వినోద్ ధన్యవాదాలు తెలిపారు.