18 చెక్​డ్యాములకు రూ.143 కోట్లు మంజూరు

18 చెక్​డ్యాములకు రూ.143 కోట్లు మంజూరు
  • 18 చెక్​డ్యాములకు రూ.143 కోట్లు
  • పరిపాలనా అనుమతులు మంజూరు 

హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చెక్​డ్యామ్స్​కు ప్రభుత్వం రూ.143.32 కోట్లను మంజూరు చేసింది. మంగళవారం ఇరిగేషన్​ శాఖ సెక్రటరీ రాహుల్​ బొజ్జా వీటికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. 

రాష్ట్రవ్యాప్తంగా 1200 చెక్​డ్యామ్స్​కు రూ.3,825 కోట్లకు పరిపాలనా అనుమతులను ఇటీవల సర్కారు మంజూరు చేసింది. అందులో భాగంగా సూర్యాపేట, తుంగతుర్తి, దేవరకొండ  పరిధిలోని 18 చెక్​డ్యాములకు రూ.143,32 కోట్లు, సూర్యాపేటలో జిల్లాలో 11 చెక్​డ్యామ్స్​కు రూ.113.80 కోట్లు, నల్గొండ జిల్లాలో 7 చెక్​డ్యామ్స్​కు రూ.29.52 కోట్లను  ప్రభుత్వం శాంక్షన్​ చేసింది.