తెలంగాణలో ఆషాఢ బోనాల ఉత్సవాలనుల ఈ ఏడాది ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ నియమించింది. ఇందుకోసం ఉత్సవాల కోసం ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఈ విషయాన్ని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ ఉత్సవాలను నిర్వహించాలని దేవాదాయ శాఖ అధికారులను మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. గోల్కొండ కోటలో బోనాల జాతర ఉత్సవాలపై మంత్రులు కొండాసురేఖ, పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు.
మంత్రి కొండా సురేఖ సీరియస్
మీటింగ్ కి అటెండ్ కానీ అధికారులపై మంత్రి కొండా సురేఖ సీరియస్ అయ్యారు. మీటింగ్ కు రాని అధికారులకు మెమోలు ఇష్యూ చేయాలని ఆదేశించారు. లక్షల మంది జరుపుకునే పండుగకు సంబంధించి మీటింగ్ పెడితే. మంత్రులు, మేయర్ వస్తే అధికారులు రారా అని ప్రశ్నించారు. గోల్కొండ కోటలో 9 వారలు బోనాలు సమర్పించే భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు మంత్రి. ప్రతి ఆదివారం, మంగళవారం, గురువారం భక్తులు వస్తారని తెలిపారు.