తెలంగాణలో 16 డీఎస్పీల బదిలీ..వెంటనే రిపోర్ట్ చేయాలని ఆదేశం

తెలంగాణ ప్రభుత్వం 16 మంది డీఎస్పీలను బదిలీ చేసింది. ఇందులో చాలామంది డీఎస్పీలకు ఏసీపీ స్థాయి హోదా దక్కింది. మహబుబాబాద్​ డీఎస్పీ పి. సదయ్యకు బెల్లంపల్లి ఏసీపీగా, రాచకొండలో ఏసీపీగా ఉన్న ఎస్​వీ హరికృష్ణను ఎల్​బీ నగర్​ ఏసీపీగా, సైబర్​క్రైమ్స్​లో ఏసీపీగా ఉన్న ఎం. కిరణ్​కుమార్​ని నిజమాబాద్​ టౌన్​ ఏసీపీగా బదిలీ చేశారు.  బదిలీ చేసిన డీఎస్పీలు..తక్షణమే  తాము పని చేస్తున్న స్థానాల నుంచి రిలీవ్ కావాలని డీజీపీ అంజినీ కుమార్ ఆదేశించారు. వెంటనే నియమించిన స్థానాల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు. 

మహబూబాబాద్ SDPOగా ఉన్న P  సాదయ్యను  బెల్లంపల్లి,రామగుండం ఏసీపీగా బదిలీ చేశారు. రాచకొండ కమిషనరేట్‌లో సైబర్ క్రైమ్స్ ACP  పని చేస్తున్న SV హ‌రికృష్ణను రాచకొండ కమిషనరేట్ లోని ఎల్బీ నగర్ ACPగా ట్రాన్స్ ఫర్ చేశారు. నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ ACP M కిరణ్ కుమార్ ను నిజామాబాద్ లా అండ్ ఆర్డర్ విభాగం ACPగా బదిలీ చేశారు. నిజామాబాద్ లా అండ్ ఆర్డర్ విభాగం ఏసీపీగా చేసిన A.  వెంకటేశ్వర్లును డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

రాచకొండ కమిషనరేట్ PD సెల్ APC R.  సంజయ్ కుమార్‌ను హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సైఫాబాద్ ACPగా నియమించారు.  సైఫాబాద్ ACPగా పని చేస్తున్న CH.  వేణుగోపాల్ రెడ్డిని డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ CCS  ACPగా పని చేస్తున్న CH శ్రీధర్‌ను బంజారా హిల్స్ ACPగా నియమించారు.  CCS  ACPగా పనిచేసిన M. సుదర్శన్‌ను డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కొంపల్లి CID DSP పీ సుబ్బయ్యను జుబ్లీహిల్స్ ఏసీపీగా బదిలీ చేశారు. డీజీపీ ఆఫీసులో వెయిటింగ్‌లో ఉన్న DSP (సివిల్) కదురా వెంకట్ రెడ్డిని మేడ్చల్ ట్రాఫిక్ ACPగా ట్రాన్స్ ఫర్ చేశారు. 

జగిత్యాల డీసీఆర్బీ ఫంక్షనల్ వెర్టికల్స్ DSPగా పని చేస్తున్న బొజ్జా రామానుజంను ఖమ్మం జిల్లా సత్తుపల్లి ACPగా బదిలీ చేశారు. హైదరాబాద్ ఇంటెలిజెన్స్ విభాగం DSPగా ఉన్న కస్తూరి శ్రీనివాస్‌ను హైదరాబాద్ నగర పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన అంబర్ పేట ACPగా ట్రాన్స్ ఫర్ చేశారు.  రాజన్న -సిరిసిల్ల డీసీఆర్బీ ఫంక్షనల్ వెర్టికల్స్ DSPగా పని చేస్తున్న బోనాలా క్రుష్ణను వరంగల్ లా అండ్ ఆర్డర్ ACPగా ట్రాన్స్ ఫర్ చేశారు. వరంగల్ లా అండ్ ఆర్డర్ ACPగా  పని చేసిన K. గిరిని.. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. అయితే రాచకొండ కమిషనరేట్ పరిధిలో యాదాద్రి ACPగా పని చేస్తున్న K. నర్సింహారెడ్డిని మాత్రం మార్చలేదు. భువనగిరి-రాచకొండ ట్రాఫిక్ ACP N. సైదులును రాచకొండ కమిషనరేట్ యాదగిరిగుట్ట ACPగా బదిలీ చేశారు.