అద్దె భవనాల్లో అవస్థలు

రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లలో సరైన వసతులు లేక భోజన వ్యవస్థ సరిగా లేక గ్రామీణ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.  సర్కారు ఆధ్వర్యంలోని హాస్టళ్లు దాదాపు 60 శాతం అద్దె భవనాల్లోనే ఉన్నాయి. ప్రతి జిల్లాలో ప్రభుత్వ భూములు చాలా  ఉన్నాయి. ఆ భూముల్లో ఎస్సీ, బీసీ హాస్టళ్లను నిర్మించవచ్చు. ప్రస్తుతం విద్యార్థులు ఉంటున్న అద్దె భవనాల్లో సెప్టిక్ ట్యాంక్ పైపులు పగిలిపోయి వాళ్లు అన్నం తినే కిచెన్ దాకా ఆ వాసన వస్తున్నది. ఒక రూమ్ లో 12 నుంచి 20 మంది  విద్యార్థులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

 దీంతో విద్యార్థులు అనారో గ్యం పాలవుతున్నారు.  రాష్ట్ర ప్రభుత్వం విద్యకు బడ్జెట్​లో నిధుల కేటాయింపు పెంచి ఎస్సీ, బీసీ సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి. ప్రభుత్వం  పేద విద్యార్థుల కోసం గురుకులాలు నెలకొల్పడం  స్వాగతించదగినదే.. అయితే వాటిల్లో మౌలిక సౌకర్యాలకు కృషి చేయాలి. వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని తక్షణం చేయాల్సిన మరమ్మతులు ఏమైనా ఉంటే ఇప్పుడే చేయాలి. పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలి. కిందటి ఏడాదిలాగా ఫుడ్​పాయిజన్​ కేసులు రాకుండా చూడాలి.

- కొత్తకొండ సాయికృష్ణ,  కిమ్స్​ లా కాలేజీ, వెదిర