
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో ప్రభుత్వం ఐదు బిల్లులను ప్రవేశపెట్టింది. మంగళవారం ఎస్సీ వర్గీకరణ బిల్లుతో పాటుగా తెలంగాణ మున్సిపాలిటీల చట్ట సవరణ, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం– 2018 సవరణ, తెలంగాణ చారిటబుల్అండ్ రెలిజియస్ ఇనిస్టిట్యూషన్స్అండ్ ఎండోమెంట్స్యాక్ట్–1987 సవరణ, తెలంగాణ అడ్వొకేట్స్వెల్ఫేర్ ఫండ్ చట్టం– 1987 సవరణ, తెలంగాణ అడ్వొకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ 1992 చట్ట సవరణల బిల్లులను ప్రవేశపెట్టారు.
అందులో ఎస్సీ వర్గీకరణ బిల్లు, తెలంగాణ చారిటబుల్అండ్ రెలిజియస్ ఇనిస్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్యాక్ట్ 1987 సవరణ బిల్లులను సభలో పాస్ చేశారు. సీఎం తరఫున శ్రీధర్ బాబు ప్రవేశపెట్టిన తెలంగాణ మున్సిపాలిటీల చట్ట సవరణ బిల్లు, అడ్వొకేట్స్ వెల్ఫేర్ ఫండ్ చట్ట సవరణ, అడ్వొకేట్స్క్లర్క్స్వెల్ఫేర్ఫండ్చట్ట సవరణ బిల్లు, మంత్రి సీతక్క ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులపై చర్చ జరగలేదు.