ఏటీఎం కార్డ్ సైజులో కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్స్..!

ఏటీఎం కార్డ్ సైజులో కొత్త స్మార్ట్ రేషన్  కార్డ్స్..!

కొత్త రేషర్ కార్డులపై స్పీడ్ పెంచింది తెలంగాణ ప్రభుత్వం. ముందుగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో  కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వాలని డిసైడ్ అయిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులు ఎలా ఉండాలి.. డిజైన్లు, రేషన్ కార్డులపై ఫ్యామిలీ ఫోటోలు ఉండాలా?వద్దా.. అనే వాటిపై సీఎం రేవంత్ రెడ్డితో అధికారులు చర్చిస్తున్నారు. ఈ క్రమంలో కొత్త రేషన్ కార్డులను  ఏటీఎం  కార్డ్  సైజ్ లో స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకొచ్చేంందుకు  ప్రభుత్వం సిద్దమవుతుందని తెలుస్తోంది.   ఇప్పటికే పలు  రేషన్ కార్డ్ డిజైన్లను సీఎంకు చూపించారు అధికారులు .

Also Read :- సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం అంత ఈజీ కాదు

అయితే ముందుగా లక్ష కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. వీటి కోసం  షార్ట్ టెండర్లు పిలిచేందుకు సిద్ధమైంది. ప్రజాపాలన, గ్రామసభలు, మీసేవ, కులగణనలో అప్లై చేసుకున్న అర్హులకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు సిద్దమవుతోంది. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. 

ముందుగా కోడ్ లేని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు..

ఎమెల్సీ కోడ్ అమల్లో లేని జిల్లాలో వెంటనే రేషన్ కార్డులు జారీ చేయాలని సీఎం ఆదేశించిన సంగతి తెలిసిందే.. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే.. ఖమ్మం, నల్లగొండ, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రం ఎన్నికల కోడ్ అమల్లో లేదు. సీఎం ఆదేశాలతో ఈ మూడు జిల్లాల్లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ షురూ కానుంది.త్వరగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చి ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పింది ప్రభుత్వం.