6 లక్షల టన్నుల సీఎంఆర్ సేకరణ .. ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ

6 లక్షల టన్నుల సీఎంఆర్ సేకరణ .. ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ

హైదరాబాద్, వెలుగు: ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో అప్పటి వరకు అవసరమయ్యే కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 

వచ్చే మూడు, నాలుగు నెలల అవసరాల కోసం రైస్ మిల్లర్ల నుంచి స్టేట్ పూల్ కింద 6 లక్షల టన్నుల సీఎంఆర్ సేకరించనున్నది. నిరుడు వానాకాలం, యాసంగిలో రైతుల నుంచి సేకరించిన ధాన్యం.. మిల్లింగ్ చేయించిన సీఎంఆర్​ను కలెక్ట్ చేయనున్నది.