
- వెయ్యి మందికి శిక్షణ షురూ
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడానికి మేస్త్రీలకు ప్రభుత్వం ట్రైనింగ్ ఇప్పిస్తోంది. హైదరాబాద్ మాదాపూర్ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ర్టక్షన్ (న్యాక్) ఫస్ట్ బ్యాచ్ లో 250 మంది మేస్ర్తీలకు శనివారం ట్రైనింగ్ ప్రారంభించారు. ఒక్కో బ్యాచ్ కు 6 రోజుల పాటు మొత్తం వెయి మందికి ట్రైనింగ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిందని న్యాక్ అధికారులు తెలిపారు. ట్రైనింగ్ అనంతరం వారిని గ్రామాల్లోకి పంపి లబ్ధిదారుల నుంచి పని ఇప్పించేలా అధికారులు ప్రయత్నాలు చేయనున్నారు. ముఖ్యంగా 50 గజాల నుంచి 100 గజాల వరకు 450 ఎస్ఎఫ్ టీ లో రూ.5 లక్షలతో ఇల్లు ఎలా నిర్మించాలన్న అంశంపై కన్ స్ర్టక్షన్ ఫీల్డ్ లో అనుభవం ఉన్న ట్రైనర్లతో శిక్షణ ఇప్పిస్తున్నారు.
వచ్చే నెలలో న్యాక్ ఆధ్వర్యంలో అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఈ ట్రైనింగ్ ఇప్పిస్తామని హౌసింగ్ డిపార్ట్ మెంట్ అధికారులు చెప్పారు. ఇక మండలాలు, మున్సిపాలిటీల్లో సిమెంట్ ఇటుకల తయారీతో పాటు సెంట్రింగ్ అందించేందుకు ఆసక్తి ఉన్నవారిని గుర్తించాలని జిల్లా ప్రాజెక్టు అధికారులకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. వీరికి మెప్మా, సెర్ప్ ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మేస్ర్తీలు, ఇటుకలు, సెంట్రింగ్ వాళ్ల కొరత ఉందని ఇళ్లు లేట్ గా చేయకుండా సాధ్యమైనంత త్వరలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.