ఏఐపై యువతకు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో శిక్షణ

ఏఐపై యువతకు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో శిక్షణ

హైదరాబాద్, వెలుగు:  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పై తెలంగాణలోని యువతకు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు టాస్క్ సంస్థతో మన అమెరికా తెలుగు అసోసియేషన్​(మాటా) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండు సంస్థలు చేతులు కలపడం అభినందనీయమని రాష్ట్ర ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు.

తెలంగాణ అకాడమీ ఫర్​ స్కిల్​అండ్​ నాలెడ్జ్​(టాస్క్) సీఈవో శ్రీకాంత్ సిన్హా, మాటా ఫౌండర్ శ్రీనివాస్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. మాటా ఫౌండర్ శ్రీనివాస్ మాట్లాడుతూ రోజుకు రెండు గంటల చొప్పున వారానికి నాలుగు క్లాస్‌‌‌‌‌‌‌‌లు ఉంటాయన్నారు. ఇది వరకే కామారెడ్డి జిల్లాలో 200 మందికి పైగా విద్యార్థు లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.