ఉస్మానియాకు కొత్త భవనం హర్షణీయం

  • తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం 

హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా దవాఖానకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నరహరి, సెక్రటరీ జనరల్ డాక్టర్ లాలు ప్రసాద్ రాథోడ్, ట్రెజరర్​డాక్టర్ రాయూఫ్ ఒక ప్రకటన లో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గతంలో ఎన్నో సార్లు కొత్త భవనం కోసం గత బీఆర్ఎస్​ప్రభుత్వానికి విన్నవించినా పెడ చెవిన పెట్టిందన్నారు.