కొత్త అప్పులు 49 వేల కోట్లు.. పాత అప్పులు, వడ్డీల కింద కట్టింది 56 వేల కోట్లు

కొత్త అప్పులు  49 వేల కోట్లు.. పాత అప్పులు, వడ్డీల కింద కట్టింది 56 వేల కోట్లు
  • పాత అప్పులు, వడ్డీల కింద కట్టింది 56 వేల కోట్లు: భట్టి 

హైదరాబాద్, వెలుగు: తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూ.49 వేల కోట్లకుపైగా రుణాలు తీసుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అదే సమయంలో పాత అప్పులు, వాటి వడ్డీల కింద రూ.56 వేల కోట్లకు పైగా చెల్లించా మని చెప్పారు. ‘రూ.80 వేల కోట్లకు పైగా అప్పులు చేసిన కాంగ్రెస్‌‌ ప్రభుత్వం.. ఒక్క ప్రాజెక్టు అయినా కట్టిందా? డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి?’ అని బీఆర్ఎస్ వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్‌‌ ప్రశ్నించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, వ్యయంపై భట్టి బుధ వారం ప్రకటన విడుదల చేశారు. 2023 డిసెంబర్ నుంచి ఈ నెల 15 వరకు తీసుకున్న అప్పుల వివరాలను అందులో వెల్లడించారు. ‘‘ఈ నెల 15 వరకు ప్రభుత్వం తీసుకున్న రుణాల మొత్తం రూ.49,618 కోట్లు. ఇదే సమయంలో పాత అప్పులు, వడ్డీల కింద రూ.56,440 కోట్లు చెల్లించినం. ప్రభుత్వం చేసిన మూలధన వ్యయం రూ.21,881 కోట్లు. రుణమాఫీ, రైతు భరోసా, చేయూత, ఫ్రీ కరెంట్, గ్యాస్ సబ్సిడీ, ఫ్రీ బస్, స్కాలర్ షిప్స్, కల్యాణలక్ష్మి పథకాల కోసం రూ.54,346 కోట్లు ఖర్చు చేసినం” అని వివరించారు. ప్రతి నెల ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని పేర్కొన్నారు.