![కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం మరోసారి లేఖ](https://static.v6velugu.com/uploads/2021/08/Telangana-government-once-again-wrote-a-letter-to-KRMB-today_8x2oRfncrg.jpg)
హైదరాబాద్: కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి తెలంగాణ ప్రభుత్వం మరోసారి లేఖ రాసింది. బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం తాగునీటి కోసం వినియోగించే జలాలు 20 శాతం మాత్రమే లెక్కించాలని సదరు లేఖలో కోరింది. అలాగే ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలించేందుకు వెలిగొండ ప్రాజెక్టును చేపట్టిందని, ఈ అక్రమ ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే ఆపివేయించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈనెల 27న కేఆర్ఎంబీ సమావేశం జరగనున్న నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరోసారి లేఖ రాసింది.