లోన్ల కోసం భూమి పట్టాలు తనఖా పెట్టుకోవద్దు

లోన్ల కోసం భూమి పట్టాలు తనఖా పెట్టుకోవద్దు
  • బ్యాంకర్లకు సూచించిన రాష్ట్ర సర్కార్

హైదరాబాద్, వెలుగు: పంట రుణాల కోసం రైతుల పట్టా పాస్ పుస్తకాలుతనఖా పెట్టుకోవద్దని భూభారతి గెజిటల్​లో బ్యాంకర్లకు రాష్ట్ర సర్కార్ స్పష్టం చేసింది. పాసు పుస్తకాలు పెట్టుకోవద్దనే నిబంధన ఉన్నప్పటికీ.. కొన్నేండ్లుగా షార్ట్ టర్మ్​ లోన్​లకు బ్యాంకు అధికారులు తనఖా పెట్టుకుంటున్నారని తెలిపింది. ఇక నుంచి కచ్చితంగా ఈ నిబంధన అమలు చేయాలని తేల్చి చెప్పింది. 

తాజాగా, రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కోసం ఫీల్డ్ సర్వే నిర్వహిస్తున్నది. సాగు యోగ్యత లేని భూముల లెక్కలు తీస్తున్నది. ఈ లెక్కల ఆధారంగా ఆబాదీ భూములను ప్రత్యేక పోర్టల్​లో, సాగు భూములను వేర్వేరుగా భూభారతి పోర్టల్​లో పొందుపర్చనున్నారు. భూ భారతి వెబ్​సైట్​లో ఉన్న డేటా ఆధారంగా క్రాప్​లోన్లు ఇవ్వనున్నారు.