గుడ్ న్యూస్: 626 మంది టీచర్ల మ్యూచువల్ బదిలీ

గుడ్ న్యూస్:  626 మంది టీచర్ల  మ్యూచువల్ బదిలీ
  • ఈ నెలలో రిటైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యే వాళ్లు వెంటనే రిలీవ్‌‌‌‌‌‌‌‌ అవ్వాలని విద్యాశాఖ ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొంతకాలంగా మ్యూచువల్‌‌‌‌‌‌‌‌ బదిలీల కోసం ఎదురుచూస్తున్న టీచర్లకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. 626 మంది టీచర్ మ్యూచువల్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్లు చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 31న రిటైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యే టీచర్లు వెంటనే రిలీవ్ కావాలని ఆదేశించారు. మిగిలిన వారిని విద్యా సంవత్సరం లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 23న రిలీవ్ చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు జరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు.  కాగా, మొత్తం 1,252 మంది టీచర్లుకు బదిలీలు జరగనున్నాయి. 

గత ప్రభుత్వం లొకాలిటీ కోసం తీసుకొచ్చిన జీవో నంబర్ 317తో చాలా మంది టీచర్లు సొంత జిల్లాల్లో కాకుండా ఇతర జిల్లాలకు అలాట్ అయ్యారు. ఈ క్రమంలో సొంత జిల్లాలకు వచ్చేందుకు రెండోసారి మ్యూచువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బదిలీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  931 టీచర్ మ్యూచువల్ బదిలీల కోసం దరఖాస్తులు వచ్చాయి. విద్యాశాఖ అధికారులు వీటిని వెరిఫై చేసి, నిబంధనలకు అనుగుణంగా ఉన్న 637 అప్లికేషన్ల వివరాలను సర్కారుకు పంపించారు. ఇందులో ఫిబ్రవరి నెలలో 11 మంది రిటైర్డ్ కాగా, మిగిలిన 626 మందికి బదిలీ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే, దరఖాస్తులన్నీ డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే తీసుకోవడంతో జనవరిలో రిటైర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన వారితో పాటు డీఎస్సీ 2024 టీచర్లు, రెండోసారి మ్యూచు వల్ బదిలీలకు అప్లై చేసుకున్న వారిని పక్కనబెట్టారు.