
- ఇద్దరు నాన్ కేడర్ ఎస్పీలు కూడా..ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
- డీజీ పర్సనల్‌గా అనిల్‌కుమార్
- వరంగల్ సీపీగా సన్‌ప్రీత్ సింగ్
హైదరాబాద్, వెలుగు:రాష్ట్ర పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో బదిలీల ప్రక్రియ మొదలైంది. ఐపీఎస్ అధికారులపై అవినీతి ఆరోపణలు, పనితీరులో నిర్లక్ష్యం, పోస్టింగుల కోసం మరి కొంతమంది వెయిటింగ్‌ల కారణంగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 21 మందిని బదిలీ చేస్తూ, పోస్టింగ్స్ ఇస్తూ సీఎస్ శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారుల్లో అడిషనల్ డీజీ, ఇద్దరు ఐజీలు, ఇద్దరు డీఐజీలతో పాటు ఇద్దరు నాన్ కేడర్ ఎస్పీలు ఉన్నారు.
మరో14 మంది ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేశారు.స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్) డీజీగా ఉన్న అనిల్‌కుమార్‌కు అడిషనల్ డీజీ (పర్సనల్)గా పోస్టింగ్ ఇచ్చారు. ఎస్పీఎఫ్ డీజీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. వరంగల్ సీపీగా విధులు నిర్వహిస్తున్న అంబర్ కిశోర్ ఝాను రామగుండం సీపీగా బదిలీ చేశారు. ఇటీవల డీఐజీగా పదోన్నతి పొందిన సన్‌ప్రీత్‌సింగ్‌ను సూర్యాపేట ఎస్పీ నుంచి వరంగల్ సీపీగా బదిలీ చేశారు. నిజామాబాద్ సీపీగా సాయి చైతన్యను, ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధుశర్మను బదిలీ చేశారు.
అధికారి పేరు ప్రస్తుతం బదిలీ స్థానం
- అనిల్‌కుమార్ డీజీ, ఎస్‌పీఎఫ్ అడిషనల్ డీజీ (పర్సనల్)
- శ్రీనివాసులు సీపీ, రామగుండం ఐజీ, సీఐడీ
- అంబర్ కిశోర్ ఝా సీపీ, వరంగల్ సీపీ, రామగుండం
- సన్‌ప్రీత్‌సింగ్ ఎస్పీ, సూర్యాపేట సీపీ, వరంగల్
- చేతన మైలాబత్తుల డీసీపీ, పెద్దపల్లి ఎస్పీ, ఉమెన్ సేఫ్టీ వింగ్, హైదరాబాద్
- సీహెచ్ సింధుశర్మ ఎస్పీ, కామారెడ్డి ఎస్పీ, ఇంటెలిజెన్స్
- రాజేశ్‌చంద్ర డీసీపీ, యాదాద్రి భువనగిరి ఎస్పీ, కామారెడ్డి
- సాయి చైతన్య ఎస్పీ, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సీపీ, నిజామాబాద్
- గౌస్ ఆలం ఎస్పీ ఆదిలాబాద్ సీపీ, కరీంనగర్
- అఖిల్ మహాజన్ ఎస్పీ, రాజన్న సిరిసిల్ల ఎస్పీ, ఆదిలాబాద్
- చెన్నూరి రూపేశ్ ఎస్పీ, సంగారెడ్డి టీజీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో
- అక్షాంశ్ యాదవ్ డీసీపీ, సెంట్రల్ జోన్ డీసీపీ, యాదాద్రి భువనగిరి
- పరితోశ్ పంకజ్ ఓఎస్డీ, కొత్తగూడెం ఎస్పీ, సంగారెడ్డి
- గిటే మహేశ్ బాబాసాహెబ్ ఓఎస్డీ, ములుగు ఎస్పీ, రాజన్న సిరిసిల్ల
- అంకిత్ కుమార్ శాంక్వర్ వెయిటింగ్ డీసీపీ, వరంగల్ ఈస్ట్
- ఏ భాస్కర్ వెయిటింగ్ డీసీపీ, మంచిర్యాల
- కే నరసింహ వెయిటింగ్ ఎస్పీ, సూర్యాపేట
- కే శిల్పవల్లి వెయిటింగ్ డీసీపీ, సెంట్రల్‌జోన్, హైదరాబాద్
- వై సాయిశేఖర్ వెయిటింగ్ ఎస్పీ, ఎస్‌ఐబీ, ఇంటెలిజెన్స్
- పి. కరుణాకర్ వెయిటింగ్ డీసీపీ, పెద్దపల్లి
- పి. రవీందర్ వెయిటింగ్ ఎస్పీ, సీఐడీ