ప్రతి ఏటా సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం

ప్రతి ఏటా సెప్టెంబర్ 17న  తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం

 తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఏటా సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహించాలని  జీవో విడుదల చేసింది.   రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ గ్రామీణ స్థానిక సంస్థల్లోనూ జాతీయ జెండా ఎగురవేయాలని ఉత్తర్వుల్లో తెలిపారు.

గల్ఫ్ కార్మికుల  సంక్షేమ కోసం అడ్వైజరీ  కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. గల్ఫ్  కార్మికులు చనిపోతే వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.  ఈ మేరకు  ప్రవాసి ప్రజావాణి పేరుతో ఫిర్యాదులు తీసుకోనుంది. గల్ప్ కార్మికుల పిల్లలకు గురుకులాల్లో  ప్రవేశం కల్పించనుంది. 

ALSO READ | సెప్టెంబర్ 17 ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం’