యాసంగికి సరిపడా నీళ్లు!.. అన్ని ప్రధాన ప్రాజెక్టుల్లో దండిగా నీటి మట్టాలు

యాసంగికి సరిపడా నీళ్లు!..  అన్ని ప్రధాన ప్రాజెక్టుల్లో దండిగా నీటి మట్టాలు
  • స్కివమ్​ నిర్ణయాలకు అనుగుణంగా
  • 42 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా ప్రణాళికలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో యాసంగి సాగుకు ప్రాజెక్టుల్లో సరిపడా నీళ్లున్నాయి. యాసంగి ప్రణాళికకు అనుగుణంగా ఆయకట్టుకు నీళ్లిచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. చిన్న, మధ్య, పెద్దతరహా ప్రాజెక్టుల కింద ఆన్​ అండ్​ ఆఫ్​ (వారబందీ) పద్ధతిలో నీళ్లిచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. యాసంగి ప్రణాళిక కింద 42.11 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని స్కివమ్ (సమీకృత నీటి ప్రణాళిక, నిర్వహణ రాష్ట్ర స్థాయి కమిటీ) మీటింగ్​లో నిర్ణయించారు.

 అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నాగార్జునసాగర్​, శ్రీరాంసాగర్, సింగూరు, మిడ్​మానేరు సహా అన్ని ప్రధాన ప్రాజెక్టుల్లోనూ నీటి మట్టం మెరుగైన స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో ఉన్న నీళ్లకు అనుగుణంగా నీళ్లివ్వనున్నారు. ఒక్క శ్రీశైలం మినహా మిగతా అన్ని ప్రాజెక్టులూ నిండు కుండల్లా మారాయి. శ్రీశైలం నుంచి ఏపీ దండిగా నీళ్లు తోడేస్తుండడంతో ఆ ఒక్క ప్రాజెక్టులోనే నీటి సామర్థ్యం 95 టీఎంసీలకు పడిపోయింది.

సాగర్​లో మెరుగ్గా..

రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో 280 టీఎంసీల వరకు వాడుకునేందుకు వీలుగా నీటి నిల్వ ఉంది. నాగార్జునసాగర్​ ప్రాజెక్టులో నీటి నిల్వ మెరుగ్గా ఉంది. ఈ  ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 237.30 టీఎంసీల మేర నీళ్లున్నాయి. ఆ ప్రాజెక్టు కింద 6.37 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని ఇరిగేషన్​ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసుకోగా.. ప్రస్తుతం ఉన్న నీటి మట్టం ఆధారంగా మరో 70 టీఎంసీల వరకు వాడుకునేందుకు వీలుంది. ఇటు ఎస్సారెస్పీలోనూ పూర్తి స్థాయి నీటి మట్టం 80 టీఎంసీలకు 60 టీఎంసీలు ఉన్నాయి.

ఆ రెండు ప్రధాన ప్రాజెక్టుల కింద ఇప్పటికే వారబందీ పద్ధతిలో నీళ్లు  రిలీజ్​ చేస్తున్నారు. ఆ రెండు ప్రాజెక్టుల నుంచి ఆయకట్టు సరిపడా నీళ్లిచ్చేందుకు ఆస్కారం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎస్సారెస్పీ మీద రివ్యూ సందర్భంగా ఎల్ఎండీ ఎగువ, దిగువన ఇప్పటికే వారబందీ పద్ధతిని ప్రారంభించారు. మార్చి వరకు ఇదే పద్ధతిని ఫాలో కానున్నారు. మీడియం ప్రాజెక్టులో 30 టీఎంసీలు, చెరువుల్లో 37 టీఎంసీల వరకు నీళ్లు అందుబాటులో ఉన్నాయి.

ఘట్​కేసర్ ఏరియాలో పనిచేస్తున్న ఓ టీచర్ ఏడాదిలో రిటైర్​ కానున్నారు. ఆ పోస్టు కోరుకున్న టీచర్ ఆదిలాబాద్ జిల్లాలో పనిచేస్తున్నారు. ఆదిలాబాద్​ టీచర్​ ఘట్​కేసర్ వచ్చేందుకు ఇక్కడ పనిచేస్తున్న టీచర్​కు రూ.50 లక్షలు ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి. రిటైర్మెంట్​కు ముందు అప్పనంగా రూ.50 లక్షలు వస్తుండడంతో మ్యూచువల్ ​ట్రాన్స్​ఫర్​కు ఘట్​కేసర్ లో పనిచేస్తున్న టీచర్​ టక్కున ఒప్పుకున్నారు. ఆడుతూ పాడుతూ ఓ ఏడాది పనిచేస్తే రిటైర్మెంట్ డబ్బులతోపాటు ఇవి కూడా దక్కుతాయనే ఉద్దేశంతో ఆదిలాబాద్ వరకైనా వెళ్లేందుకు రెడీ అయ్యారు.

రంగారెడ్డి జిల్లా షాద్​నగర్ సమీపంలో ఓ మ్యాథ్స్ టీచర్ పోస్టింగ్ కోసం పెద్దపల్లి జిల్లాలో పనిచేస్తున్న టీచర్  రూ.23 లక్షలకు డీల్ ​మాట్లాడుకున్నారు. నిర్మల్ జిల్లా నుంచి యాదాద్రి జిల్లాకొచ్చే ఓ సోషల్ టీచర్ రూ.18 లక్షలు ఇచ్చుకున్నారు. జగిత్యాల నుంచి సిద్దిపేట జిల్లా కొచ్చే టీచర్ రూ.15 లక్షలు ఇచ్చుకోక తప్పలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే వందల ఉదాహరణలున్నాయి. 

రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి మట్టాలివి

ప్రాజెక్టు                                   పూర్తి కెపాసిటీ                              ప్రస్తుత నిల్వ

                                                (టీఎంసీ)                                      (టీఎంసీ)

శ్రీశైలం                                   215.81                                           95.59

నాగార్జునసాగర్​                      312.05                                           237.30

శ్రీరాంసాగర్                       ​    80.50                                             60.12

జూరాల                                  9.66                                               6.55

సింగూరు                               29.91                                              26.91

నిజాంసాగర్​                          17.8                                                13.66

మిడ్​మానేరు                         27.50                                              24.45

లోయర్​ మానేరు                  24.03                                              18.55

శ్రీపాద ఎల్లంపల్లి                20.18                                               17.59

కడెం                                    7.60                                                  5.87