మహబూబాబాద్ అర్బన్(సీరోలు)/ కురవి/ నర్సింహులపేట (మరిపెడ), వెలుగు: తెలంగాణ ప్రజాప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్ అన్నారు. శనివారం సీరోలు మండలం కొత్తూరు (సీ) శివారులోని గుజిలీతండాలో కొన్నేండ్ల కింద మూతపడిన ప్రాథమిక పాఠశాలను ఆయన పున:ప్రారంభించారు. అడ్మిషన్ పొందిన 15 మంది విద్యార్థులకు డీఈవో రవీందర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చంద్రెడ్డితో కలిసి స్కూల్ దుస్తులను అందజేశారు.
కురవి మండలం బలపాలలో రూ.1.45 లక్షలతో నిర్మించిన హెల్త్ సెంటర్ను ఎమ్మెల్యే రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు మాలోతు నెహ్రూ నాయక్, మహబూబాబాద్ మార్కెట్ చైర్మన్ సుధాకర్ కలిసి ప్రారంభించారు. అనంతరం మరిపెడ మండల కేంద్రంలోని ఆడిటోరియంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.