కేంద్రం నుంచి రాష్ట్రానికి 176.5 కోట్లు

కేంద్రం నుంచి రాష్ట్రానికి 176.5 కోట్లు

హైదరాబాద్, వెలుగు: కేంద్ర రవాణా శాఖ నుంచి రాష్ట్రానికి రూ.176.5 కోట్లు రానున్నాయి. రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక పెట్టుబడి సహాయ పథకం కింద ఈ నిధులు విడుదల చేయనుంది. కేంద్ర రవాణా, హైవేస్  శాఖ ఆధ్వర్యంలోని ఈ పథకం నిర్వహణలో కీలకమైన మైలురాయి సాధించినందుకు అదనపు ప్రోత్సాహక సహాయం అందించనుంది. ఎంవీ ట్యాక్స్ కేటగిరీలో రూ.125 కోట్లు, స్క్రాప్ వెహికల్స్ కేటగిరీలో  రూ.51.5 కోట్లకు తెలంగాణ ప్రభుత్వం అర్హత సాధించినట్టు కేంద్ర రవాణా, హైవేస్ శాఖ సెక్రటరీ యెటేందర్ కుమార్ వెల్లడించారు.

 పదిహేనేండ్లు పైబడిన వాహనాలను స్క్రాప్ చేస్తున్న విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రణాళిక రూపంలో కేంద్రానికి పంపింది. ఈ స్క్రాపింగ్ పథకంతో మరో రూ.75 కోట్లు అర్హత సాధించింది. అలాగే, రాష్ట్రంలోని 21 జిల్లాలను ప్రాధాన్యతగా తీసుకుని పనిచేయడం ద్వారా మరో రూ.31.5 కోట్లు అర్హత సాధించింది. ఇలా మొత్తంగా రూ.176.5 కోట్లు కేంద్రం నుంచి అందుకోనుంది.