రైతులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. రైతులకు చెందిన 2 లక్షల రూపాయల అప్పులను మాఫీ చేయటానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది సర్కార్. 2024, జూలై 15వ తేదీ ఈ మేరకు విధివిధానాలను అధికారికంగా విడుదల చేశారు అధికారులు. రుణ మాఫీ మార్గదర్శకాలు ఏంటో వివరంగా చూద్దాం..
>>> తెలంగాణలో భూమి కలిగివున్న ప్రతి రైతు కుటుంబానికి రూ.2లక్షల పంట రుణ మాఫీ వర్తిస్తుంది.
>>> ఈ స్కీం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది
>>> ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది.
>>> తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు వాటి బ్రాంచ్ ల నుండి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది.
>>> 12 డిసెంబర్ 2018 తేదీన లేదా ఆ తర్వాత మంజూరయిన లేక రెన్యువల్ అయిన రుణాలకు మరియు 09-డిసెంబర్ -2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంటరుణాలకు ఈ పథకం వర్తిస్తుంది.
>>> ఈ పథకం కింద ప్రతి రైతుకుటుంబం, 2 లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీకి అర్హులు. 09- డిసెంబర్ -2023 తేదీ నాటికి బకాయి వున్న అసలు, వర్తింపయ్యే వడ్డీ మొత్తం పథకానికి అర్హత కలిగి వుంటుంది.
>>> రైతు కుటుంబం నిర్ణయించడానికి పౌరసరఫరాల శాఖ వారు నిర్వహించే ఆహార భద్రత కార్డు (పిడిఎస్) డేటాబేస్ ప్రామాణికంగా ఉంటుంది. అట్టి కుటుంబంలో, ఇంటి యజమాని, జీవిత భాగస్వామి, పిల్లలు మున్నగు వారు ఉంటారు.
>>> వ్యవసాయ శాఖ కమిషనర్, సంచాలకులు పంట రుణమాఫీ 2024 పథకాన్ని అమలు చేసే అధికారింగా ఉంటారు.
>>> వ్యవసాయ శాఖ సంచాలకులు మరియు ఎన్ఐసి సంయుక్తంగా ఈ పథకం అమలు కోసం ఒక ఐటీ పోర్టల్ ను నిర్వహిస్తారు. ఈ ఐటీ పోర్టల్ లో పరతి రైతు కుటుంబానికి సంబంధించిన లోక్ అకౌంట్ డేటా సేకరణ, డేటా వాలిడేషన్, అర్హత మొత్తాన్ని నిర్ణయించడానికి సౌక్యం ఉంటుంది. ఈ ఐటీ పోర్టల్ లో ఆర్థిక శాఖ నిర్వహించే ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ కి బిల్లులు సమర్పించటం, ఈ పథకానికి సంబంధించిన భాగస్వాములందరితో సమాచారాన్ని పంచుకోవడానికి, రైతులు ఇచ్చే కంప్లయింట్స్ పరిష్కారానికి మాడ్యూల్స్ ఉంటాయి.
>>> ఈ పథకం అమలు కోసం ప్రతి బ్యాంకులో ఒక బ్యాంక్ నోడల్ అధికారిగా నియమించాలి. ఈ బ్యాంక్ నోడల్ అధికారి బ్యాంకులకు, వ్యవసాయ శాఖ సంచాలకులు మరియు ఎన్ఐసి మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. బ్యాంక్ నోడల్ అధికారులు తమ సంబంధిత బ్యాంక్ యొక్క పంట రుణాల డేటాను డిజిటల్ సంతకం చేయాలి.
>>> ప్రతి బ్యాంక్ తమ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ నుండి రిఫరెన్స్-1 మెమో జత చేసినట్టి ప్రొఫార్మా-1లో డిజిటల్ సంతకం చేసి ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు సీబీఎస్ లో లేవు. కాబట్టి, పీఎసీఎస్ కు అనుబంధమైన సంబంధిత బ్యాంక్ బ్రాంచ్, రిఫరెన్స్-2వ మెమో జత చేసినట్టి ప్రొఫార్మ-2లో డేటాను డిజిటల్గా సంతకం చేసి ప్రభుత్వానికి సమర్పించాలి.
>>> ప్రతి బ్యాంకు సీబీఎస్ నుండి సేకరించిన డేటాను యథాతథంగా ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ ప్రక్రియ తప్పుడు చేరికలు, తప్పుడు తీసివేతలను నివారించడం. అవసరమైతే వ్యవసాయశాఖ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టలి.
>>> ఈ పథకం కింద లబ్ధిదారులు, రైతుకుటుంబాన్ని గుర్తించడానికి బ్యాంకులు సమర్పించిన రైతు రుణఖాతాలోని ఆధార్ ను పాస్ బుక్ డేటా బేస్ లో ఉన్న ఆధార్ తో, పీడీఎస్ డేటాబేస్ లో ఉన్న ఆధార్ తో మ్యాప్ చేయాలి. ఈ విధంగా గుర్తించబడ్డ ఒక్కో రైతు కుటుంబానికి డిసెంబర్ 9 2023 వరకు ఉన్న లోన్ ఎమౌంటు నుంచి రుణమాఫీ రూ.2.00 లక్షల వరకు పరిమితి వర్తిస్తుంది.
>>> అర్హతగల రుణ మాఫీ మొత్తాన్ని డీబీటీ పద్ధతిలో నేరుగా లబ్ధిదారులు రైతు రుణఖాతాలకు జమచేయబడుతుంది. పీఎసీఎస్ విషయంలో రుణమాఫీ మొత్తాన్ని డీసీసీబీ లేదా బ్యాంకు బ్రాంచికి విడుదల చేయడమవుతుంది. ఆ బ్యాంకు వారు రుణమాఫీ మొత్తాన్ని పీఎసీఎస్ లో ఉన్న రైతు ఖాతాలో జమచేస్తారు.
>>> ఏ కుటుంబానికి అయితే రూ.2.00 లక్షలకు మించిన రుణం ఉంటుందో, ఆ రైతులు రూ.2.00 లక్షలకు పైబడివున్న రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. ఆ తరువాత, అర్హతగల రూ. 2.00 లక్షల మొత్తాన్ని రైతు కుటుంబీకుల రుణ ఖాతాలకు బదిలీ చేస్తారు. రూ. 2.00 లక్షల కంటే ఎక్కువ రుణం వున్న పరిస్థితులలో కుటుంబంలో రుణం తీసుకున్న మహిళల రుణాన్ని మొదట మాఫీ చేసి, మిగులు మొత్తాన్ని దామాషా పద్దతిలో కుటుంబంలో పురుషుల పేరు మీద తీసుకున్న రుణాలను మాఫీ చేయాలి.
>>> ఈ రుణమాఫీ ఎస్చ్ఐలు, జెఎల్టిలు, ఆర్ఎంజిలు, ఎస్ఇసిఎస్ కు తీసుకున్న రుణాలకు వర్తించదు. ఈ రుణమాఫీ పునర్వ్యవస్థీకరించిన లేదా రీషెడ్యూలు చేసిన రుణాలకు వర్తించదు. కంపెనీలు, ఫర్మ్స్ వంటి సంస్థలకి ఇచ్చిన పంటరుణాలకు వర్తించదు. కానీ పీఏసీఎస్ ద్వారా తీసుకున్న పంటరుణాలకు వర్తిస్తుంది.
>>> కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పీఎం-కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద డేటా లభ్యంగా ఉన్నంత మేరకు ఆచరణాత్మకంగా అమలు చేయడం వీలైనంత వరకు పరిగణనలోనికి తీసుకోబడుతుంది.
>>> బ్యాంకుల యొక్క బాధ్యత :- ప్రతి బ్యాంకులో డేటాను బాధ్యతగా ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ డేటాలో రైతుల అర్హత, ప్రతి రైతుకు సంబంధించిన పంట రుణఖాతా వివరాలు సమాచార వాస్తవికత, సమగ్రత ఉండేలా సరియైన విధంగా ఇవ్వాలి. పథకం కోసం నిర్వహించే ప్రతి డాక్యుమెంటుపై, రూపొందించిన ప్రతి జాబితాపై బ్యాంకు బీఎస్ఓ డిజిటల్ సంతకం చేయాలి. నిర్ణీత మార్గదర్శకాలను ఉల్లంఘించి డేటాను సమర్పించిందని భవిష్యత్తులో కనుగొన్నట్లయితే చట్టప్రకారం బ్యాంకులపై చర్యలు తీసుకోవాలి.