![నీలగిరి నయా మాస్టర్ ప్లాన్ .. నోటిఫికేషన్ విడుదల](https://static.v6velugu.com/uploads/2025/02/telangana-government-released-the-nilgiri-master-plan-geo-on-january-28_Kypr8kY9hb.jpg)
- మరో వారం రోజుల్లో డ్రాఫ్ట్ పబ్లికేషన్
- భవిష్యత్‌అవసరాల మేరకు నూతన ప్లాన్
నల్గొండ, వెలుగు: నీలగిరి మాస్టర్‌ప్లాన్‌కు అడుగులు పడుతున్నాయి. . గత నెల 28న ప్రభుత్వం నీలగిరి మాస్టర్ ప్లాన్ జీవో రిలీజ్ చేసింది. 2041 వ రకు పట్టణ అవసరాలకు తగినట్టుగా మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని సూచించింది.నల్లగొండ మునిసిపాలిటీలో 1987లో అప్పటి జనాభా ప్రతిపదికన రూపొందించిన మాస్టర్‌ప్లానే నేటికీ కొనసాగుతోంది. ప్రతీ 20 ఏళ్లకు మాస్టర్‌ప్లాన్‌రూపొందించాలి. కానీ, నీలగిరిలో పాత ప్లానే అమలవుతోంది. దీంతో బఫర్, గ్రీన్‌జోన్లలో ఇండ్ల నిర్మాణాలకు పర్మిషన్స్ లభించక ఆ ప్రాంత వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణ జనాభా పెరిగినా, అందుకు అనుగుణంగా ఆదాయ వనరులు పెరగడం లేదు. మున్సిపల్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను ప్రభుత్వం పరిశీలించి త్వరలో గెజిట్ నోటిఫికేషన్ తయారు చేసే అవకాశం ఉంది.
నూతన ప్లాన్
రానున్న 20 ఏళ్ల కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నూతన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది. గతంలో నల్లగొండ పట్టణం 33 చదరపు మైళ్ల మేర విస్తరించి ఉండగా, కొత్త ప్లాన్‌ప్రకారం 107. 48 చదరపు మైళ్లు విస్తరించింది. మొత్తం 950కి.మీ రోడ్లతో పట్టణం అభివృద్ధి చెందనుంది. 2014లో మునిసిపాలిటీలో విలీనమైన చర్లపల్లి, కేశరాజుపల్లి, ఆర్జాలబావి, మర్రిగూడ, శేశమ్మగూడెం, గంధవారిగూడెం, మామిళ్లగూడెం తదితర ప్రాంతాలు కొత్త మాస్టర్‌ప్లాన్‌లోకి వచ్చాయి.
పెరిగిన జనాభా, మరో 20 ఏళ్ల వరకు పెరిగే 20శాతం జనాభా,వచ్చే ఆదాయ వనరులను దృష్టిలో ఉంచుకొని మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిస్తున్నారు. పట్టణాన్ని నివాసిత, పారిశ్రామిక, వాణిజ్య, మిక్స్ డ్, వాటర్‌బాడీస్, వ్యవసాయ జోన్, అర్బనైజబుల్, పబ్లిక్, సెమి పబ్లిక్, గ్రేవ్‌యార్డ్, ట్రాఫిక్, రవాణా, రిక్రియేషన్స్, బఫర్, హిల్‌వంటి ప్రాంతాలుగా విభజించారు. వచ్చే 20 ఏళ్లలో రోడ్లు, పార్కులు, వీధి లైట్లు, ట్రాన్స్ పోర్ట్, డంపింగ్‌యార్డు, తాగునీటి వసతులు, పబ్లిక్‌టాయిలెట్లు, విద్య, వాణిజ్య సంస్థలు, జంక్షన్లు, ఐటీ హబ్, మెడికల్‌కళాశాల, పర్యాటకం, గ్రీన్‌జోన్లు, జనాభా, భౌగోళిక విస్తీర్ణం మేరకు మౌలిక వసతులు కల్పించేందుకు మాస్టర్ ప్లాన్ తయారు
చేస్తున్నారు.
మారనున్న రూపురేఖలు
నల్లగొండ పట్టణంలో గౌతమి కళాశాల ప్రాంతం, అమూల్య కాలనీ, వెంకటసాయి ఫంక్షన్‌హాల్, బండారు గార్డెన్స్‌తదితర ప్రాంతాలు గతంలో గ్రీన్‌జోన్‌లో ఉన్నా యి. ఐటీఐ, డైట్‌కళాశాల వెనుక భాగం, కలెక్టరేట్‌ఎదురుగా ఉన్న శబరి హోమ్స్, వెనుక భాగం, తదితర ప్రాం తాలు ఇండస్ట్రియల్‌జోన్‌లో ఉన్నాయి. హై దరాబాద్‌రోడ్డులోని మనోరమా హోటల్‌వెనుక భాగం, గంధంవారి గూడెం రోడ్డు, అమూల్య కాలనీలో కొంత భా గం కమర్షియల్‌జోన్‌లో ఉన్నాయి.
అయితే నూతన మా స్టర్‌ప్లాన్‌ప్రాకారం ఈ ప్రాంతాలన్నీ రెసిడెన్షియల్‌జోన్లు గా మారనున్నాయి. దీంతో ఈ ప్రాంతాల్లో గృహాల నిర్మాణాలకు అనుమతులు సులభంగా లభించడంతోపాటు మునిసిపాలిటీకి ఆదాయం పెరగనుంది. కేశరాజుపల్లి, శేషమ్మగూడెం, మర్రిగూడెం శివారు ప్రాంతాలు, చర్లపల్లి నుంచి అప్పాజీపేట వెళ్లే దారి, ఎఫ్‌సీఐ గోదాం సమీప ప్రాంతం, ఆర్జాలబావి తదితర ప్రాంతాలు ఇండస్ట్రియల్‌జోన్‌పరిధిలోకి మారాయి. వీటితో పాటు ఎల్‌ఎస్‌గుట్ట, కాపురాల గుట్టల అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌లో అవకాశం కల్పించారు.
ఔటర్ పైనే స్పెషల్ ఫోకస్...
ప్లాన్ 'ఏ' ప్రకారం నకిరేకల్ నుంచి వచ్చే 565-- హైవే నల్గొండ టౌన్లోకి రాకుండా పానగల్లు, కేశరాజుపల్లి మీదుగా నేరుగా ఎస్ఎల్బీసీ రోడ్డు (సా గర్ రోడ్డు-- 5 65 హైవే)కు కలుపుతారు. మళ్లీ ఇక్కడి నుంచి కలెక్టరే ట్ వెనక భాగం నుంచి మిర్యాలగూడ రోడ్డుకు లింక్ చేస్తారు. ఇదే రోడ్డు ను శేషమ్మగూడెం శివారు ప్రాంతం నుంచి నకిరేకల్ హైవేకే లింక్ చేస్తారు. దీంతో నల్గొండ చుట్టు రింగ్ రోడ్డు మోడల్ తలపిస్తుందని చెప్తున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే నల్గొండ మున్సిపల్ శివారు మొత్తం రింగ్ రోడ్డు జోన్లోకి వస్తుంది.
తద్వారా ఈ ప్రాంతంలో ఇప్పటికే వెలిసిన రియల్ ఎస్టేట్ వెంచర్లతోపాటు, కొత్త వెంచర్ల ఏర్పాటు, వ్యవసాయ భూములు ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. మాస్టర్ ప్లాన్లో రింగ్‌రోడ్డు కలిసొచ్చేలా డిజైన్ చేశారు. అదే పట్టణం లోపల మాత్రం అనేక చిక్కు ముడులు ఉన్నాయి. వీటిన్నింటిని సరిచేసినట్లయితే అటు మున్సిపాలిటీ ఆదాయానికి, అటు ప్రజలకు, వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటద ని రిటైర్డ్ ప్లానింగ్ ఆఫీసర్లు, పలువురు మున్సిపల్ అధికారులు అభిప్రా య పడుతున్నారు.