పెద్దపల్లి బస్​డిపో ఏర్పాటుకు లైన్​ క్లియర్​ .. రూ. 11.70 కోట్లు రిలీజ్​ చేస్తూ ప్రభుత్వం జీవో

పెద్దపల్లి బస్​డిపో ఏర్పాటుకు లైన్​ క్లియర్​ .. రూ. 11.70 కోట్లు రిలీజ్​ చేస్తూ ప్రభుత్వం జీవో

పెద్దపల్లి, వెలుగు: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పెద్దపల్లి బస్​డిపో ఏర్పాటుకు లైన్ క్లియర్​ అయింది. రూ. 11.70 కోట్లు రిలీజ్ చేస్తున్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. పెద్దపల్లి బస్టాండ్‌‌ను ఆనుకొని ఉన్న ఎంపీడీఓ ఆఫీసు ఆవరణలో దాదాపు 9 ఎకరాలుండగా.. ఆ స్థలంలో డిపో నిర్మించేందుకు అధికారులు నిర్ణయించారు. దీంతో కొద్ది రోజుల్లోనే పెద్దపల్లి జిల్లావాసులకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగు కానున్నాయి. జిల్లాలో రెండు డిపోలు ఉండగా గోదావరిఖనిలో 130 బస్సులు, మంథని 65 బస్సులతో ఉన్నాయి. కాగా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువగా ఉండడంతో నేటికీ రాత్రియితే బస్సు సౌకర్యం లేని గ్రామాలు చాలా ఉన్నాయి. 

ధర్మారం, జూలపల్లి, ఎలిగేడు, కాల్వ శ్రీరాంపూర్​,  ఓదెల, ముత్తారం, పాలకుర్తి, అంతర్గాం మండలాల్లోని చాలా గ్రామాలకు బస్సు సౌకర్యం తక్కువగా ఉంది. రోజులో ఒకసారి  బస్సులు వచ్చిపోతుండటంతో ప్రయాణికులు జీపులు, ఆటోల మీద ఆధారపడుతున్నారు. పెద్దపల్లి డిపో పూర్తయినట్లయితే మరో 100 పైగా బస్సులు అందుబాటులో రానున్నట్లు వచ్చే అవకాశం ఉంది. దీంతో పూర్తిస్థాయిలో గ్రామీణ ప్రాంత ప్రయాణికులకు మేలు కలుగుతుందని జిల్లావాసులు భావిస్తున్నారు.