రైతు బీమాకు రూ.1,141 కోట్లు రిలీజ్

ఉత్తర్వులు జారీ చేసిన వ్యవసాయ శాఖ

హైదరాబాద్, వెలుగు: రైతు బీమా పథకం కోసం రూ.1,141.44 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి గురువారం జీవో జారీ చేశారు. రాష్ట్రంలో 18 నుంచి 59 ఏళ్లు ఉండే అర్హులైన రైతులకు ఈ నిధులతో బీమా సౌకర్యం కల్పించనున్నారు. రాష్ట్రంలో 2018 ఆగస్టు14 నుంచి రైతు బీమా అమలవుతోంది. 60 ఏళ్లలోపు పట్టాదారు రైతులందరూ అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం 2018 లో 31.27 లక్షల మంది రైతులకు ఎల్ఐసీ ద్వారా ఇన్సూరెన్స్ కల్పించారు. ఒక్కోరైతుకు రూ .2,271.50 (జీఎస్టీ కలుపుకుని) చొప్పున ఎల్ఐసీకి ప్రభుత్వం రూ . 710.50 కోట్లు చెల్లించింది. 2019 ఆగస్టు 13వ తేదీ వరకు బీమా పరిధిలో ఉన్న 17,519 మంది రైతులు దురదృష్టవశాత్తు వివిధ కారణాలతో చనిపోయారు. వారి వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారులు (ఎఇఒ) ఎల్ఐసీకి ఆన్‌లైన్ లో సమర్పించగా రూ 5 లక్షల చొప్పున రూ.875.95 కోట్ల పరిహారం చెల్లించింది. అంటే ప్రీమియం కట్టిన మొత్తం కంటే అధికంగా క్లెయిమ్స్ రూపంలో అందించింది. 2019లో 32.16 లక్షల మంది రైతులకు బీమా వర్తింపజేశారు. రూ.3,157.40 ప్రీమియం చొప్పున ఎల్ఐసీకి రూ.1,065.37 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. జూన్ 20 నాటికి 10,961 రైతు కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఎల్ఐసీ రూ.548 కోట్ల పరిహారం ఇచ్చింది.

For More News..

1,412 బడుల్లో పిల్లలే లేరు

ఇక నుంచి ఆర్టీసీ పెట్రోల్‌ బంకులు

ఆన్‌లైన్ క్లాసుల కోసం స్టూడెంట్లకు నెలకు రూ.1,000 ఆర్థిక సాయం