- ఎన్‌డబ్ల్యూడీఏని కోరిన తెలంగాణ
హైదరాబాద్, వెలుగు: కృష్ణా నది జలాల వివాదాల ట్రిబ్యునల్2 (కేడబ్ల్యూడీటీ2) లో కృష్ణా జల వివాదాలపై కేసు నడుస్తున్నదని, ఆ కేసు పూర్తయ్యేదాకా గోదావరి–కావేరి లింక్‌పై పున:పరిశీలన చేయాలని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్‌డబ్ల్యూడీఏ) ను తెలంగాణ కోరింది. కృష్ణాలో నీటి కొరత ఎక్కువగా ఉంటుందని, ఏపీ ఔట్‌సైడ్ బేసిన్‌కు ఎక్కువ నీటిని తరలించుకుపోతున్నదని, దాంతో తెలంగాణకు నష్టం జరుగుతున్నదని వివరించింది.
కేసు నడుస్తున్నందున గోదావరి– కావేరి లింక్ ప్రతిపాదనతో తెలంగాణకు కృష్ణా నీటి వాటాల్లో నష్టం జరిగే అవకాశం ఉంటుందని వాదించింది. కేడబ్ల్యూడీటీ 2లో వాదనలు 2025 జనవరిలో ప్రారంభమవుతాయని, మరో ఆరు నెలల్లో వాదనలు పూర్తవుతాయని చెప్పింది. ఆ కేసు పూర్తయ్యే వరకు గోదావరి– కావేరి లింక్ ప్రతిపాదనపై పున:పరిశీలన చేయాలని కోరింది.
ALSO READ : ఖమ్మం సిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ.. నెరవేరబోతున్న ఎన్నో ఏళ్ల కల
గురువారం నిర్వహించిన ఎన్‌డబ్ల్యూడీఏ యాన్యువల్ జనరల్ మీటింగ్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు కేంద్రానికి తేల్చి చెప్పింది. ఎప్పట్లాగే గోదావరి–కావేరి అనుసంధానంపై మునుపటి స్టాండ్‌నే తెలంగాణ తేల్చి చెప్పింది.