సత్తుపల్లికి  5 కోట్లు మంజూరు

సత్తుపల్లి, వెలుగు: సత్తుపల్లి పట్టణ అభివృద్ధికి టీఎస్ యూఎఫ్ఐడీసీ ద్వారా రూ.5 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.రాజ్యసభ ఎంపీ పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్యే  వెంకటవీరయ్యకు  మంత్రులు కేటీఆర్, మహమూద్​ అలీ ఉత్తర్వులు అందించారు. నిధుల మంజూరుపై పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేశారు.  

నియోజక వర్గంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు హాజరు కావాలని మంత్రులను వారు ఆహ్వానించారు.