- మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం మూడు కొత్త జూనియర్ కాలేజీలను మంజూరు చేసింది. ఎమ్మెల్యే గడ్డం వినోద్ గత ఏడాది జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయంపై ప్రస్తావించి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇటీవల ప్రభుత్వం నియోజకవర్గంలోని నెన్నెల, తాండూర్, వేమనపల్లి మండలాలకు జూనియర్ కాలేజీలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బెల్లంపల్లిలో బాలురు, బాలికల జూనియర్ కాలేజీతో పాటు కాసిపేటలో ఒక జూనియర్ కాలేజీ ఉండగా, ఇపుడు వీటితో నియోజకవర్గంలో సంఖ్య ఆరుకు చేరనుంది.
దీంతో ఈ మూడు మండలాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్, ఎమ్మెల్యే వినోద్ ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. దీంతో ఎమ్మెల్యే గడ్డం వినోద్ హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. శాలువాతో సన్మానించారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను సీఎం సహాయంతో త్వరలోనే పరిష్కరిస్తానని తెలిపారు.