లక్షా 32 వేల కోట్ల పెట్టుబడులు.. 46 వేల ఉద్యోగాలు : దావోస్ లో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు

లక్షా 32 వేల కోట్ల పెట్టుబడులు.. 46 వేల ఉద్యోగాలు : దావోస్ లో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు

దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ ప్రభుత్వం రికార్డ్ ఒప్పందాలు చేసుకున్నది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. దావోస్ వేదికగా ఇదే రికార్డ్ కావటం విశేషం. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీథర్ బాబు ఆధ్వర్యంలోని బృందం.. ఏకంగా 10 ఒప్పందాలు చేసుకున్నది. పెట్టుబడుల విలువ అక్షరాల ఒక లక్షా 32 వేల కోట్లు అయితే.. ఈ పెట్టుబడుల వల్ల 46 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే భారీ పెట్టుబడుల రికార్డ్ నమోదైంది. 

2024లో జరిగిన దావోస్ పర్యటనలో రాష్ట్రానికి 40 వేల 232 కోట్ల పెట్టుబడులు వస్తే.. 2025లో జరిగిన దావోస్ పర్యటన ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఈసారి మూడింతలకు మించిన పెట్టుబడులు తీసుకురావటం విశేషం. దావోస్ వేదికపై ఈసారి తెలంగాణ రాష్ట్రం అందరి దృష్టిని ఆకర్షించింది. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలోని తెలంగాణ రైజింగ్ బృందం దావోస్ లో పలువురు పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశాలన్నీ విజయవంతమయ్యాయి. 

హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వటం ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలను విశేషంగా ఆకట్టుకుంది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, మెట్రో విస్తరణకు ప్రభుత్వం ఎంచుకున్న భవిష్యత్ ప్రణాళికలు పెట్టుబడుల వెల్లువకు దోహదపడ్డాయి. 

ALSO READ | జనవరి 23 నుంచే జాన్​ పహాడ్​ ఉర్సు

రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న తెలంగాణ రైజింగ్ 2050 విజన్ గేమ్ ఛేంజర్ గా నిలిచింది. అన్ని రంగాలకు అనుకూలమైన వాతావరణమున్న హైదరాబాద్ గ్రేటర్ సిటీ  పెట్టుబడుల గమ్యస్థానంగా మరోసారి ప్రపంచానికి చాటిచెప్పినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సరళతరమైన పారిశ్రామిక విధానంతో పాటు ఇటీవల ప్రకటించిన క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ ప్రపంచ పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించింది. దేశ విదేశాలకు చెందిన 10 ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో అంచనాలకు మించి భారీ పెట్టుబడులను సాధించింది సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం. 

దావోస్ లో వరసగా మూడు రోజులు  ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం లక్షా 32 లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు రాష్ట్రంలో 46 వేల మంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి.