ట్రాన్స్​జెండర్లకు తెలంగాణ ప్రభుత్వం చేయూత

ట్రాన్స్​జెండర్లకు తెలంగాణ ప్రభుత్వం చేయూత

తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెండర్ల సంక్షేమానికి మెరుగైన చర్యలు తీసుకుంటూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆరంభమైన ఈ చారిత్రాత్మక కార్యక్రమాలు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌జెండర్ల జీవన 
ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరుస్తున్నాయి.

 ట్రాన్స్‌‌‌‌‌‌‌‌జెండర్ల కోసం ప్రత్యేక నియామకాల ప్రక్రియను ప్రవేశపెట్టడమే కాకుండా, వారి ఉపాధి అవకాశాలను పెంచుతూ, హైదరాబాద్ నగర ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు అద్భుతమైన ప్రణాళికను అమలు చేస్తున్నారు. సమాజంలో ట్రాన్స్‌‌‌‌‌‌‌‌జెండర్లకు గౌరవమైన హోదా కలిపిస్తూ తమకు అన్ని వర్గాల ప్రజలు సమానమే అని ప్రభుత్వం  చాటి చెబుతోంది.

ట్రాన్స్‌‌‌‌‌‌‌‌జెండర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు, వారి సామాజిక హోదాను పెంచేలా ప్రభుత్వం చొరవ తీసుకుంది.  ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించడంతో వారు గౌరవమైన జీవితం గడుపుతున్నారు. ట్రాన్స్‌‌‌‌‌‌‌‌జెండర్లకు సమాజంలో తమ స్థానాన్ని నిర్ధారించుకోవడానికి ఈ నిర్ణయం చారిత్రాత్మకమైనది.  ప్రపంచవ్యాప్తంగా ఇంతటి వినూత్న విధానం ఎక్కడా లేకపోవడంతో  ఈ నిర్ణయానికి  ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. ఇది పాలనలో సృజనాత్మకతకు నిదర్శనం.

సమాజంలో సమానత్వానికి నాంది..

రాష్ట్ర ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంక్షేమ శాఖచే  దివ్యాంగులు,  ట్రాన్స్‌‌‌‌‌‌‌‌జెండర్ల ఉపాధి కోసం  ప్రత్యేక పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసింది. దీని ద్వారా దాదాపు 24 మందికి ఉద్యోగ అవకాశాలు కలిపించి ఆర్థిక పునరావాసం కల్పిస్తున్నది.  దివ్యాంగులు, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌జెండర్లకు ఉపాధి కల్పనకి ప్రభుత్వం చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా,  ట్రాన్స్‌‌‌‌‌‌‌‌జెండర్‌‌‌‌‌‌‌‌ల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసి రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ప్రత్యేకంగా మైత్రి క్లినిక్స్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసి, వారికి అవసరమైన ఆరోగ్య సేవలు, కౌన్సెలింగ్, వైద్య సహాయం అందించే ఏర్పాట్లు చేసింది.  ఈ చర్య సమాజంలో సమానత్వం, ఆత్మగౌరవం కల్పించడంలో   కీలకంగా నిలుస్తోంది.  

ట్రాన్స్‌‌‌‌‌‌‌‌జెండర్ల సంక్షేమానికి తీసుకున్న ఈ చారిత్రాత్మక చర్యలు భారతదేశానికి  మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. సామాజిక స్పృహ, సృజనాత్మకత, సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధి  ప్రశంసనీయమైనది. ఈ ప్రగతిశీల కార్యక్రమాలు నూతన సమాజ నిర్మాణానికి దోహదపడతాయి.  సమాజంలో అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా  ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతను నిర్వహించాలి.

సామాజిక గౌరవం

 వరంగల్ జిల్లా చింతలపల్లి గ్రామానికి చెందిన శృతి ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘గతంలో తమను సమాజం చూసే తీరు  జీవితం పట్ల నిరాశ కలిగించేది. కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణంగా ఇప్పుడు  హైదరాబాద్ ట్రాఫిక్ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌గా గౌరవంగా బతుకుతున్నాం. ఇంతకుముందు సమాజం ఛీ అంటే, ఇప్పుడు చేతులెత్తి గౌరవంగా నమస్కరిస్తోంది. ఈ గౌరవం మా కమ్యూనిటీకి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినదే. 


ఇలాంటి అవకాశాలు మాకు ఏప్రభుత్వాలు ఇవ్వలేదు. ఆయన దారి చూపకపోతే,  మేంఇంకా అడుక్కునేవాళ్లమే. అటువంటిది ఈ ప్రభుత్వం మా కమ్యూనిటీ సంక్షేమానికి పాటుపడుతోంది. సిగ్నల్స్​ వద్ద అడుక్కునే మమ్మల్ని అదే సిగ్నల్ వద్ద ట్రాఫిక్ సహాయకులుగా ఉద్యోగం కలిపించి  సామాజిక గౌరవం కల్పించింది.  మా ఉన్నతికి కృషి చేస్తూ మాకు గౌరవమైన జీవితం కల్పిస్తున్న ముఖ్యమంత్రికి ఎన్నటికీ కమ్యూనిటీ అంతా రుణపడి ఉంటాం’ అని  ట్రాన్స్​జెండర్ల కమ్యూనిటీ తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.

-  ఎం. కిరణ్మయి, పౌర సంబంధాల అధికారి, సమాచారశాఖ -