ఆరోగ్యశ్రీకి కొత్త కార్డులు.. యూనిక్ ఐడీతో ఇవ్వనున్న సర్కార్

ఆరోగ్యశ్రీకి కొత్త కార్డులు.. యూనిక్ ఐడీతో ఇవ్వనున్న సర్కార్
  • రేషన్ కార్డుతో లింకు కట్
  • అందరికీ స్కీమ్ వర్తింపజేయడంపై కసరత్తు
  • రూ.400 కోట్లు అదనంగా ఖర్చవుతుందని అంచనా
  • హెల్త్ స్కీమ్‌లన్నింటినీ ఒకే గొడుకు కిందకు తేవడంపై చర్చ

హైదరాబాద్, వెలుగు: రాజీవ్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ప్రభుత్వం కొత్త కార్డులు ఇవ్వనున్నది. ప్రైవేటు ఇన్సూరెన్స్ సంస్థలు ఇచ్చే కార్డుల తరహాలో, ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని యూనిక్ ఐడీతో కార్డులు తేనుంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఒక్కో సబ్ నంబర్ ఇవ్వనున్నారు. ఇదే కార్డును హెల్త్ ప్రొఫైల్‌కు లింక్ చేసి, స్టేట్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను తయారు చేయనున్నారు. ఇన్నాళ్లూ తెల్ల రేషన్‌కార్డును ప్రాతిపాదికగా తీసుకుని స్కీమ్‌ను అమలు చేశారు.

ఇకపై ఆరోగ్యశ్రీకి, రేషన్‌కార్డుకు లింకు పెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కాంగ్రెస్‌ సర్కార్ వచ్చినప్పటి నుంచే కసరత్తు జరుగుతుండగా, సీఎం రేవంత్‌రెడ్డి రెండ్రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. స్కీమ్‌లో లబ్ధిదారులను గుర్తించడంపై అధికారులు ఇప్పటికే కసరత్తు చేశారు. రేషన్‌కార్డు, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ స్కీమ్‌ను వర్తింపజేయాలని భావిస్తున్నారు. 

ప్రస్తుతం ఏటా ఆరోగ్యశ్రీకి రూ.1,100 కోట్లు ఖర్చు అవుతున్నాయి. స్కీమ్‌‌‌‌ ‌‌‌‌  ను అందరికీ వర్తింపజేస్తే ఇంకో రూ.400 కోట్లు అదనంగా ఖర్చు అవుతాయని అధికారులు అంచనా వేశారు. రాష్ట్రంలో సుమారు 1.3 కోట్ల కుటుంబాలు ఉండగా, ఇందులో 90 లక్షల కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులున్నాయి. మిగిలిన 40 లక్షల కుటుంబాల్లో సుమారు 15 లక్షల కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు వచ్చే అవకాశం ఉంది. వీళ్లు పోను ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నత ఆదాయ వర్గాల కుటుంబాలు మాత్రమే మిగులుతాయి.

ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్‌‌‌‌ ‌‌‌‌  ఎస్‌‌‌‌ ‌‌‌‌  , పోలీసులకు ఆరోగ్య భద్రత, సింగరేణి వంటి కార్పొరేషన్ల ఉద్యోగులకు ఆ సంస్థలు ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్‌‌‌‌ ‌‌‌‌   స్కీములు ఉన్నాయి. సాఫ్ట్‌‌‌‌ ‌‌‌‌  వేర్ ఉద్యోగాలు, మంచి ప్రైవేటు ఉద్యోగాలు చేసేవాళ్లు ప్రభుత్వంపై ఆధారపడకుండా సొంతగా హెల్త్ ఇన్సూరన్స్‌‌‌‌ ‌‌‌‌   తీసుకుంటున్నారు. పేద కుటుంబాలకు చెందినవారే ఆరోగ్యశ్రీ స్కీమ్‌‌‌‌ ‌‌‌‌  ను వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీని అందరికీ వర్తింపజేయడం వల్ల ఎక్కువ ఆర్థిక భారం పడదని అధికారులు అంచనా వేస్తున్నారు.

యాక్సిడెంట్ బాధితులకు అండగా..

యాక్సిడెంట్లు, స్ట్రోక్స్‌‌‌‌ ‌‌‌‌  , సూసైడ్స్ తదితర ఎమర్జెన్సీ కండీషన్‌‌‌‌ ‌‌‌‌  లో ఉన్న పేషెంట్లకు ప్రైవేటు హాస్పిటల్స్‌‌‌‌ ‌‌‌‌  లో ఉచితంగా చికిత్స అందేలా ట్రామా కేర్ ప్యాకేజ్‌‌‌‌ ‌‌‌‌  ను తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ ప్యాకేజీలో భాగంగా ట్రామా కేర్​లో అడ్మిట్ అయ్యే పేషెంట్​కు రూ.లక్ష వరకు చార్జీలను ప్రభుత్వమే భరిస్తున్నది. గోల్డెన్ హవర్​లో ట్రీట్‌‌‌‌ ‌‌‌‌  మెంట్ అందించి పేషెంట్‌‌‌‌ ‌‌‌‌   ప్రాణాలను కాపాడడమే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం. మన స్టేట్‌‌‌‌ ‌‌‌‌  లో కూడా ఇదే తరహా పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించారు.

ఇప్పటికే రెండుసార్లు చెన్నైకి వెళ్లి అక్కడ స్కీమ్ అమలవుతున్న తీరును ఆఫీసర్లు అధ్యయనం చేశారు. ఇక్కడ ఆ స్కీమ్ ఇంప్లిమెంటేషన్‌‌‌‌ ‌‌‌‌   కోసం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ ట్రామా కేర్ ప్యాకేజీని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆరోగ్యశ్రీ ఎంపానల్‌‌‌‌ ‌‌‌‌  మెంట్ ఉండి, స్పెషాలిటీ సర్వీసెస్ అందుబాటులో ఉన్న హాస్పిటల్స్‌‌‌‌ ‌‌‌‌  ను ట్రామా కేర్‌‌‌‌ ‌‌‌‌  ‌‌‌‌ ‌‌‌‌  కు ఉపయోగించుకోవచ్చునని ఆఫీసర్లు చెబుతున్నారు. మల్టిపుల్ ఇంజూరి కేసులకు ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిలో చికిత్స చేయడం లేదు. ట్రామాకేర్ సిస్టమ్ అందుబాటులోకి వస్తే, ఈ సమస్యకు కూడా పరిష్కారం దొరుకుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

ఒకే గొడుకు కిందకు తెచ్చే ఆలోచన

ప్రస్తుతం రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డు కుటుంబాలకు ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్‌‌‌‌ ‌‌‌‌ఎస్, జర్నలిస్టులకు జేహెచ్‌‌‌‌ ‌‌‌ఎస్‌‌‌‌ ‌‌‌‌ , పోలీసులకు ఆరోగ్య భద్రత వంటి హెల్త్ స్కీమ్‌‌‌‌ ‌‌‌‌ లు అమలు అవుతున్నాయి. ఆయా స్కీమ్‌‌‌‌ ‌‌‌‌  ల అమలుకు వేర్వేరు వ్యవస్థలు ఉన్నాయి. వీటన్నింటినీ ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చి అమలు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని, తద్వారా ఖర్చు ఏమైనా తగ్గతుందా అన్నదానిపై అధ్యయనం చేయాలని అధికారులకు సర్కార్ సూచించినట్టు తెలిసింది. అయితే, ఇప్పటికే ఈహెచ్‌‌‌‌ ‌‌‌‌  ఎస్‌‌‌‌ ‌‌‌‌   కోసం కొత్తగా ఓ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

పూర్తిగా ఉచితంగా తమకు అవసరం లేదని, నెల నెలా కొంత మొత్తాన్ని తామే ప్రభుత్వానికి ఇస్తామని, అంతే మొత్తాన్ని ప్రభుత్వం నుంచి జమ చేసి హెల్త్ స్కీమ్‌‌‌‌ ‌‌‌‌  ను పక్కగా అమలు చేయాలని సర్కార్‌‌‌‌ ‌‌‌‌  ‌‌‌‌ ‌‌‌‌  ను కోరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీఆర్‌‌‌‌ ‌‌‌‌  ‌‌‌‌ ‌‌‌‌  ఎస్ సర్కార్ ఇందుకు అనుగుణంగా ఓ జీవోను కూడా విడుదల చేసింది. పోలీసుల ఆరోగ్య భద్రత స్కీమ్ కూడా ఈహెచ్‌‌‌‌ ‌‌‌‌  ఎస్‌‌‌‌ కంటే బెటర్​గా అమలు అవుతోంది.

ఈ నేపథ్యంలో వాళ్లు కూడా ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే అంశాన్ని వ్యతిరేకించే అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీ అమలులో లోపాలు ఉండడం, బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం వల్ల ట్రీట్‌‌‌‌ మెంట్ చేయడానికి ప్రైవేటు హాస్పిటళ్లు నిరాకరిస్తుండడం వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకే గొడుకు కిందకు తీసుకురావడం అనుకున్నంత సులభం కాదని అధికారులు చెబుతున్నారు.