4 జిల్లాల్లో 120 ట్రైబల్ కమ్యూనిటీ సెంటర్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో 120 ట్రైబల్ కమ్యూనిటీ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. ఆసిఫాబాద్​లో 43, ఆదిలాబాద్​లో 34, మంచిర్యాలలో 22, నిర్మల్​లో 21 కమ్యూనిటీ బిల్డింగ్స్ ఏర్పాటు చేయాలని ట్రైబల్ అధికారులు నిర్ణయించారు. ఒక్కో బిల్డింగ్​ను రూ.25 లక్షల వ్యయంతో ట్రైబల్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో నిర్మించనున్నారు.

 సొంత భవనాలు లేక బయటి ప్రదేశాల్లో లేదా గ్రామ పంచాయతీ భవనాల్లో సమావేశాలు చేపడుతున్నామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ట్రైబల్ నేతలు తీసుకెళ్లారు. ట్రైబల్ సమస్యలపై మంత్రి సీతక్క ఆధ్వర్యంలో మాజీ ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే ఎడ్మ బొజ్జు ఆధ్వర్యంలో 30 మంది నేతలు సీఎంతో భేటీ అయ్యారు. సొంత భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు రెడీ చేసి తనకు అందించాలని ఆ సమావేశంలో అధికారులను సీఎం ఆదేశించారు.