
- ఈ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామన్న ఎండీ సజ్జనార్
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో 3038 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆ సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని చెప్పారు. సోమవారం ఆర్టీసీ ఆధ్వర్యంలో కళా భవన్ లో జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో సజ్జనార్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యలను ఆర్టీసీ యాజమాన్యం..ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందని పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన అన్ని అంశాలను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పరిష్కరించే ప్రయత్నం చేస్తానని వివరించారు. కొందరు చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన కోరారు.