సాగర్ శ్రీశైలం బ్యాక్ వాటర్ లో కేరళ తరహాలో బోట్ హౌసులు

సాగర్ శ్రీశైలం బ్యాక్ వాటర్ లో కేరళ తరహాలో బోట్ హౌసులు

రాష్ట్రానికి సంబంధించిన కొత్త టూరిజం పాలసీని ఫిబ్రవ‌‌రి 10వ తేదీలోగా సిద్ధం చేయాల‌‌ని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న ప‌‌ర్యాట‌‌క ప్రదేశాలు,  అభ‌‌యార‌‌ణ్యాలు, ఆల‌‌యాల ప్రాతిప‌‌దిక చేసుకొని అత్యుత్తమమైన పాల‌‌సీని రూపొందించాల‌‌ని సూచించారు. బుధవారం హైదరాబాద్​లోని తన నివాసంలో పర్యాటక శాఖపై సీఎం రేవంత్​రెడ్డి స‌‌మీక్ష నిర్వహించారు. వివిధ రాష్ట్రాలు అనుస‌‌రిస్తున్న, అంత‌‌ర్జాతీయంగా ప్రముఖ‌‌మైన పాల‌‌సీల‌‌ను అధ్యయ‌‌నం చేసి, తెలంగాణ ప‌‌ర్యాట‌‌క పాల‌‌సీ రూపొందించాల‌‌ని అధికారుల‌‌కు సూచించారు.

తెలంగాణకు దేశీయ పర్యాట‌‌కుల‌‌నే కాకుండా ఇంటర్నేషనల్​ టూరిస్టులను ఆక‌‌ర్షించాల‌‌న్నారు. ప‌‌ర్యాట‌‌క రంగంలో మల్టీ నేషనల్​ కంపెనీల (ఎంఎన్​సీ) పెట్టుబ‌‌డుల‌‌ను ఆక‌‌ర్షించేలా పాల‌‌సీ ఉండాల‌‌ని తెలిపారు. ఎంఎన్‌‌సీలు పెట్టుబ‌‌డులు పెట్టిన‌‌ప్పుడు అంత‌‌ర్జాతీయ స్థాయి ప్రమాణాలతో వ‌‌స‌‌తులు ఏర్పడ‌‌తాయ‌‌ని, అప్పుడు ప‌‌ర్యాట‌‌కుల ఆక‌‌ర్షణ సులువవుతుందని అన్నారు. తెలంగాణ‌‌లో క‌‌వ్వాల్‌‌, అమ్రాబాద్ పులుల అభ‌‌యార‌‌ణ్యాలను స‌‌ఫారీ టూరిజానికి అనువుగా తీర్చిదిద్దాల‌‌ని సూచించారు. స‌‌మ్మక్క-సార‌‌క్క, రామ‌‌ప్ప దేవాల‌‌యం, ల‌‌క్నవ‌‌రాల‌‌ను స‌‌ర్య్యూట్‌‌గా తీర్చిదిద్దాల‌‌ని తెలిపారు. నాగార్జునసాగ‌‌ర్, శ్రీ‌‌శైలం బ్యాక్ వాట‌‌ర్​లో  కేర‌‌ళ త‌‌ర‌‌హాలో బోటు హౌస్‌‌ల ద్వారా ప‌‌ర్యాట‌‌కుల సంఖ్య పెరిగేలా చూడాల‌‌ని సీఎం సూచించారు. 

Also Read : ఫిబ్రవరి 10లోగా కొత్త టూరిజం పాలసీ

బౌద్ధ సర్క్యూట్​ ఏర్పాటు చేయాలి

రాష్ట్రంలోని బౌద్ధ ప‌‌ర్యాట‌‌క ప్రదేశాలను క‌‌లుపుతూ బౌద్ధ స‌‌ర్క్యూట్ ఏర్పాటు చేయాల‌‌ని అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. స‌‌మ్మక్క- సార‌‌క్క జాత‌‌ర‌‌కు పెద్ద సంఖ్యలో వ‌‌చ్చే భ‌‌క్తులు స‌‌మీపంలోని ప‌‌ర్యాట‌‌క ప్రదేశాల‌‌ను సంద‌‌ర్శించేలా ప్రణాళిక‌‌లు రూపొందించాల‌‌ని సూచించారు. సింగ‌‌పూర్ వంటి దేశాలు త‌‌క్కువ ప్రదేశంలో వైవిధ్యమైన ప్రణాళిక‌‌ల‌‌తో పెద్ద సంఖ్యలో ప‌‌ర్యాట‌‌కుల‌‌ను ఆకర్షించడం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నాయ‌‌ని వివరించారు. ఆ తరహా ఎకో టూరిజం విధానాలను పరిశీలించాలని సూచించారు. 

హైద‌‌రాబాద్ లోని ఎన్టీఆర్ గార్డెన్‌‌, సంజీవ‌‌య్య పార్క్‌‌, ఇందిరా పార్క్‌‌ల‌‌ను క‌‌లుపుతూ స్కైవాక్‌‌, స‌‌ర్య్యూట్‌‌ను అభివృద్ధి చేయాల‌‌ని తెలిపారు. అనంత‌‌గిరితోపాటు ఇత‌‌ర ప్రాంతాల్లోనూ వ‌‌స‌‌తులు మెరుగుప‌‌ర్చాల‌‌ని అన్నారు. ప‌‌రిశ్రమ‌‌లు, ఇత‌‌ర రంగాల నుంచి వ‌‌చ్చే ఆదాయ‌‌మే కాకుండా ప‌‌ర్యాట‌‌క రంగం నుంచి వ‌‌చ్చే ఇన్​కమ్​ పెరిగితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవ‌‌స్థ మ‌‌రో ద‌‌శ‌‌కు చేరుకుంటుంద‌‌ని రేవంత్ రెడ్డి తెలిపారు.  స‌‌మీక్షలో రాష్ట్ర ప‌‌ర్యాట‌‌క శాఖ మంత్రి జూప‌‌ల్లి కృష్ణారావు, రాష్ట్ర ప‌‌ర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ ప‌‌టేల్ ర‌‌మేశ్ రెడ్డి,  త‌‌దిత‌‌రులు పాల్గొన్నారు.