హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా10 మంది ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. గ్రేహౌండ్స్‌లో అడిషనల్ ఎస్పీలుగా విధులు నిర్వహిస్తున్న 2021, 2022 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌లను వివిధ జిల్లాలకు బదిలీచేస్తూ సీఎస్ శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేహౌండ్స్ విభాగంలో ఏఎస్పీలుగా విధులు నిర్వహిస్తున్న కాజల్ (2021) ను ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏఎస్పీగా, కంకణాల రాహుల్ రెడ్డి (2021) ని భువనగిరి ఏఎస్పీగా బదిలీ చేశారు.
2022 బ్యాచ్‌కు చెందిన ఎస్.చిత్తరంజన్ ను -ఆసిఫాబాద్, చైతన్య రెడ్డిని -కామారెడ్డి, పందెర చేతన్ నితిన్ ను -జనగాం, విక్రాంత్ కుమార్ సింగ్‌ను -భద్రాచలం, ఎన్.శుభం ప్రకాష్ ను- కరీంనగర్, రాజేష్ మీనాను -నిర్మల్, పి. మౌనికను -దేవరకొండకు బదిలీ చేశారు. భద్రాచలం ఏఎస్పీగా ఉన్న అంకిత్ కుమార్ సంఖ్వార్ ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.