- మహిళా పెన్షనర్స్ ఫోరం డిమాండ్
ఖైరతాబాద్, వెలుగు: రిటైర్డ్మహిళా ఉద్యోగులకు హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వ మహిళా పెన్షనర్స్ ఫోరం డిమాండ్ చేసింది. ప్రెస్‌క్లబ్‌లో సోమవారం రిటైర్డ్మహిళా పెన్షనర్స్ఫోరం అడహాక్కమిటీ కార్యవర్గ ఎన్నిక జరిగింది.
చైర్మన్‌గా ఆర్.ఉమాదేవి, కో-చైర్మన్‌గా కె. ధనలక్ష్మి, కన్వీనర్‌గా ఎస్.ఎమ్.ఎల్నాగమాంబ, వైస్చైర్మన్లుగా నాగమణిరెడ్డి, జానకి ఎన్నికయ్యారు. హెల్త్ కార్డులకు సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డికి వినతి పత్రం అందజేసినట్లు చైర్మన్ ఉమాదేవి తెలిపారు.