హైదరాబాద్: కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ప్రభుత్వం తరపున ఇరిగేషన్ శాఖ ఈఎన్సి మురళీధరన్ లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని విడుదల చేయడాన్ని ఆపాలని లేఖలో కోరిన ప్రభుత్వం శ్రీశైలంలోని కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో చేపట్టిన విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. త్రిసభ్య కమిటీ అనుమతి లేకుండా నీటి విడుదల చేయరాదని ఆదేశించాలని కోరింది. అలాగే శ్రీశైలం ప్రాజెక్టుతోపాటు నాగార్జునసాగర్, పులిచింతలలో కూడా పూతి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తికి అనుమతివ్వాలని.. ప్రస్తుతం కాలువలకు నీటి విడుదల అవసరం ఉన్న దృష్ట్యా రైతుల కోసం విద్యుత్ ఉత్పత్తి కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. కృష్ణా నది నీరు.. కృష్ణా నది పరివాహక ప్రాంతాల అవసరాకే వినియోగించేలా చూడాలని.. కృష్ణా నది పరివాహక ప్రాంతం దాటి ఇతర ప్రాంతాలకు తరలించకుండా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది.
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపాలంటూ కొద్ది రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం రాసిన లేఖకు సమాధానంగా స్పందిస్తూ తెలంగాణ ప్రభుత్వం తాజా లేఖ రాసింది. శ్రీశైలం ప్రాజెక్టుతోపాటు.. నాగార్జునసాగర.. పులిచింతలలో కూడా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేపట్టేందుకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.