ఇవాళ ( జనవరి 30) మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. బాపూఘాట్ లో గాంధీ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు.
ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు.