హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు సీపీ రాధాకృష్ణన్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆవిర్భావం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలు గర్వపడుతున్నారని, అమరవీరులకు ఇది నివాళి అని ఆయన అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ విభిన్న సంస్కృతులు, కళలతో విలసిల్లే గొప్ప నేల అని కొనియాడారు.