మహాలక్ష్మీ గేమ్ ఛేంజర్.. ప్రజలే కేంద్రంగా పాలన: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

మహాలక్ష్మీ గేమ్ ఛేంజర్.. ప్రజలే కేంద్రంగా పాలన: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

అన్ని వర్గాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. సామాజిక న్యాయం,సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహిళలకు,యువతకు ,రైతులకు పెద్ద పీఠ వేస్తున్నామని చెప్పారు.  రైతుల అభివృద్దికోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.

అభివృద్ధి,ప్రగతి వైపు తెలంగాణ అడుగులు వేస్తోందన్నారు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ.  జయజయహే గీతాన్ని రాష్ట్ర గీతంగా చేసుకున్నాం. సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం.  తెలంగాణ ప్రజల కల సాకారానికి ఈ బడ్జెట్.  వరి ఉత్పత్తిలో  దేశంలోనే  తెలంగాణ అగ్రగామిగా ఉంది.  ప్రజలే కేంద్రంగా పరిపాలన జరుగుతోంది.  రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేశాం. 25 వేల కోట్లతో రైతు రుణమాఫీ చేశాం.  మా ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.   రాష్ట్ర అభివృద్దే మా ప్రభుత్వ ధ్యేయం. 

వరి రైతులకు రూ.500 బోనస్ ఇచ్చాం. మహాలక్ష్మీ స్కీం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ రవాణా  కల్పించాం. మహిళా సంఘాలతో  ఇందిరా శక్తి  క్యాంటిన్ లు ఏర్పాటు చేశాం.  మహిళా సంఘాలకు యూనిఫాంలు కుట్టే అవకాశం కల్పించాం. ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు యంగ్ ఇండియా స్కిల్ వర్శిటీ ఏర్పాటు చేస్తున్నాం. 

మహాలక్ష్మి పథకం గేమ్ ఛేంజర్ లా మారింది. రూ. 500లకే గ్యాస్ సిలిండ్ ఇస్తున్నాం. టీఎస్ పీఎస్ ని బలోపేతం చేశాం. ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం చుట్టాం.  పేదలకు200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. ఆరోగ్రశ్రీ సాయం రూ.10లక్షలకు పెంచాం.  కొత్తగా 163 సేవలను ఆరోగ్యశ్రీలో చేర్చాం. క్రీడాకారుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నాం. వ్యవసాయ కూలీలలకు 12 వేలు ఇస్తున్నాం. రైతు భరోసా 12 వేలకు పెంచాం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించబోతున్నామని అన్నారు.