తెలంగాణ భూ భారతి చట్టానికి గవర్నర్ ఆమోదం

భూ భారతి చట్టానికి  తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు.  వీలైనంత త్వరగా చట్టాన్ని అమల్లోకి తెస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూ భారతి చట్టాన్ని తెచ్చామన్నారు. ప్రజలకు మెరుగైన రెవెన్యూ  సేవలు అందిస్తామన్నారు. సామాన్యుల సంక్షేమమే ధ్యేయంగా భూ భారతి చట్టం అమలు చేస్తామని చెప్పారు.

ALSO READ| ధరణి దరఖాస్తులు పెండింగ్ లో ఉంచొద్దు : కలెక్టర్ ఇలా త్రిపాఠి

గత ప్రభుత్వం వ్యక్తిగత స్వార్థం కోసం రెవనెన్యూ చట్టాన్ని ఛిన్నాభిన్నం చేసిందని ధ్వజమెత్తారు పొంగులేటి. తెలంగాణలో భూ సమస్య లేని గ్రామం లేదన్నారు.  రెవెన్యూ పాలన చూసేందకు ప్రతీ గ్రామానికో అధికారిని నియమిస్తామని తెలిపారు పొంగులేటి. తెలంగాణ భూ భారతి (భూ హక్కుల చట్టం)–2024  బిల్లుకు 2024 డిసెంబర్ 20న  అసెంబ్లీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే..

భూ భారతి బిల్లులోని ప్రధానాంశాలు..
    

  • అనుభ‌‌‌‌వ‌‌‌‌దారుడి వివ‌‌‌‌రాలు కూడా రెవెన్యూ రికార్డులో న‌‌‌‌మోదు కానున్నాయి. అనుభ‌‌‌‌వ‌‌‌‌దారుడికి ఈ చ‌‌‌‌ట్టం ర‌‌‌‌క్షణ‌‌‌‌గా నిలుస్తుంది. ప్రస్తుత ధ‌‌‌‌ర‌‌‌‌ణి చ‌‌‌‌ట్టంలో ఈ అవ‌‌‌‌కాశం లేదు.    

  • ధ‌‌‌‌ర‌‌‌‌ణిలో ఉన్న త‌‌‌‌ప్పుల‌‌‌‌ను స‌‌‌‌వ‌‌‌‌రించ‌‌‌‌డానికి, భూమి ఉండి కూడా కొత్త పాస్ పుస్తకాలు రాని వాళ్లకు (పార్టు-–బీ కేసుల‌‌‌‌కు 18 లక్షల ఎకరాలు ) రికార్డులకు ఎక్కించి పాస్ పుస్తకాల‌‌‌‌ను ఇచ్చే విధంగా కొత్త చ‌‌‌‌ట్టం రూపొందించారు.  

  • ఈ త‌‌‌‌ర‌‌‌‌హా భూ స‌‌‌‌మ‌‌‌‌స్యల‌‌‌‌ను ప‌‌‌‌రిష్కరించ‌‌‌‌డానికి లేదా ఈ ప‌‌‌‌ని చేయ‌‌‌‌డానికి లేదా స‌‌‌‌రి చేయ‌‌‌‌డానికి త‌‌‌‌హ‌‌‌‌శీల్దార్‌‌‌‌, ఆర్డీవో, అద‌‌‌‌న‌‌‌‌పు క‌‌‌‌లెక్టర్లకు అధికారం క‌‌‌‌ల్పిస్తారు.  

  • ప్రస్తుతం ఉన్న ధ‌‌‌‌ర‌‌‌‌ణి రికార్డును పూర్తిగా ప్రక్షాళ‌‌‌‌న చేసిన త‌‌‌‌ర్వాత‌‌‌‌నే కొత్త చ‌‌‌‌ట్టం కింద రికార్డును నమోదు చేస్తారు. అప్పటివరకు ఇప్పుడున్న ధ‌‌‌‌ర‌‌‌‌ణి రికార్డు తాత్కాలికంగానే కొన‌‌‌‌సాగుతుంది. ప్రక్షాళ‌‌‌‌న చేసి కొత్త రికార్డును రూపొందిస్తారు. భ‌‌‌‌విష్యత్తులో భూ స‌‌‌‌ర్వేను కూడా చేసి రికార్డును రూపొందించుకునే అవ‌‌‌‌కాశం క‌‌‌‌ల్పించనున్నారు.  

  • రిజిస్ట్రేష‌‌‌‌న్ చేసుకున్న త‌‌‌‌ర్వాత వెనువెంట‌‌‌‌నే మ్యుటేష‌‌‌‌న్ జ‌‌‌‌రిగి పాస్ పుస్తకం వ‌‌‌‌స్తుంది. ఒక‌‌‌‌వేళ ఏదైనా త‌‌‌‌ప్పు జ‌‌‌‌రిగితే అప్పీల్ చేసుకునే అవ‌‌‌‌కాశం  కూడా కొత్త చ‌‌‌‌ట్టం క‌‌‌‌ల్పిస్తుంది.  

  • భవిష్యత్తులో భూవివాదాలకు తావు లేకుండా ఎంజాయ్‌‌‌‌మెంట్ సర్వే చేయించి శాశ్వతంగా పరిష్కరించే విధానం అందుబాటులోకి వస్తుంది.  

  • మ్యుటేష‌‌‌‌న్​కు మ్యాప్ త‌‌‌‌ప్పనిస‌‌‌‌రిగా ఉంటుంది. పాస్ పుస్తకంలో కూడా మ్యాప్  ఉంటుంది. దీంతో స‌‌‌‌రిహ‌‌‌‌ద్దు వివాదాలు, డ‌‌‌‌బుల్ రిజిస్ట్రేష‌‌‌‌న్లకు అవ‌‌‌‌కాశం ఉండ‌‌‌‌దు.  

  • వార‌‌‌‌స‌‌‌‌త్వ భూముల‌‌‌‌కు నిర్ణీత కాలంలో విచార‌‌‌‌ణ చేసిన త‌‌‌‌ర్వాత‌‌‌‌నే పాస్ పుస్తకాలు జారీ అవుతాయి. ఇంత‌‌‌‌కు ముందు ఎలాంటి విచార‌‌‌‌ణ లేకుండానే జారీ చేయ‌‌‌‌డం అన్నద‌‌‌‌మ్ముల మ‌‌‌‌ధ్య, కుటుంబాల‌‌‌‌లో వివాదాల‌‌‌‌కు దారితీసింది. ఇక నుంచి ఈ ప‌‌‌‌రిస్థితి ఉండ‌‌‌‌దు.

  •   13బీ, 38ఈ, ఓఆర్‌‌‌‌సీ, లావుని ప‌‌‌‌ట్టా వంటి మార్గాల్లో భూమి వ‌‌‌‌చ్చిన‌‌‌‌ప్పుడు పాస్‌‌‌‌ పుస్తకాలు పొందే అవ‌‌‌‌కాశం పాత చ‌‌‌‌ట్టంలో లేదు. వీరంద‌‌‌‌రికీ కూడా పాస్ పుస్తకాల‌‌‌‌ను ఆర్డీవో ద్వారా ఇచ్చే అవ‌‌‌‌కాశాన్ని కొత్త చ‌‌‌‌ట్టం క‌‌‌‌ల్పిస్తుంది.   

  • సాదాబైనామాల క్రమ‌‌‌‌బ‌‌‌‌ద్ధీక‌‌‌‌ర‌‌‌‌ణ‌‌‌‌కు ద‌‌‌‌ర‌‌‌‌ఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్న సుమారు 9 ల‌‌‌‌క్షల పైగా ఉన్న స‌‌‌‌న్న, చిన్న కారు రైతుల‌‌‌‌కు ఈ చ‌‌‌‌ట్టం ప‌‌‌‌రిష్కారం చూపుతుంది. పాత చ‌‌‌‌ట్టంలో ఈ అవ‌‌‌‌కాశం లేదు. 2020 నవంబర్​ 10 వరకు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో వచ్చిన  దరఖాస్తులకు పరిష్కారం లభించనుంది.   

  • గ్రామ కంఠం, ఆబాదీల‌‌‌‌కు కూడా హ‌‌‌‌క్కుల రికార్డును ఈ చ‌‌‌‌ట్టం క‌‌‌‌ల్పిస్తుంది.  

  • భూ స‌‌‌‌మ‌‌‌‌స్యలను జిల్లా స్థాయిలోనే ప‌‌‌‌రిష్కారం కానున్నాయి. భూ స‌‌‌‌మ‌‌‌‌స్యల‌‌‌‌ ప‌‌‌‌రిష్కారానికి జిల్లా స్థాయిలో రెండంచెల అప్పీల్ వ్యవ‌‌‌‌స్థ, ప్రత్యేకంగా భూమి ట్రిబ్యున‌‌‌‌ల్ ఏర్పాటు జ‌‌‌‌రుగ‌‌‌‌నుంది. అవసరాన్ని, ప్రాంతాన్ని బట్టి వీటి సంఖ్యపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఏ విధ‌‌‌‌మైన భూ స‌‌‌‌మ‌‌‌‌స్యలున్నా  కోర్టుల‌‌‌‌కు వెళ్లకుండా జిల్లా స్థాయిలోనే ప‌‌‌‌రిష్కారం దొరుకుతుంది.   

  • ఏ రైతైనా ఆర్థిక ఇబ్బందులు, ఇత‌‌‌‌ర కార‌‌‌‌ణాల‌‌‌‌తో అప్పీల్ చేసుకోలేని ప‌‌‌‌రిస్థితి ఉంటే, అలాంటి వారికి ప్రభుత్వమే ఉచితంగా న్యాయ స‌‌‌‌హాయం అందిస్తుంది.    

  • గత ప్రభుత్వం కొన్ని వివరాలను బహిర్గతం కాకుండా ప్రైవేట్​లో బంధించింది. ఇప్పుడు భూ-భారతితో ఎవరైనా ఎక్కడి నుంచైనా చూసుకునేలా డిస్‌‌‌‌ప్లే చేస్తారు.   

  • ప్రభుత్వ ఆస్తుల్ని ఉద్దేశపూర్వకంగా తారుమారు చేసే అధికారులపై క్రిమినల్​ చర్యలు తీసుకుని శిక్షించేలా కొత్త చట్టంలో నిబంధనలున్నాయి.   

  • ధరణిలో 33 మాడ్యూళ్లు (ఆప్షన్స్) ఉండగా.. ఇప్పుడు దాన్ని ఆరు మాడ్యూళ్లకు కుదించారు. 

  • రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్ జరగకుండా కంప్యూటర్ రికార్డులతో పాటు నిర్ణీత కాల వ్యవధిలో మాన్యువల్ కాపీని కూడా రెవెన్యూ ఆఫీసుల్లో భద్రపరుస్తారు.     

  • ధరణిలో రిజిస్ట్రేషన్ దస్తావేజుల ద్వారా మ్యుటేషన్ జరిగేటప్పుడు ఏవైనా తప్పులు జరిగితే అప్పీల్ చేసుకునే వ్యవస్థ లేదు. ఎవరికి ఫిర్యాదు చేసుకోవాలో తెలియని పరిస్థితి. ఇప్పుడు కొత్త చట్టం అప్పీలేట్ అథారిటీని ఏర్పాటు చేస్తుంది. 

  •