మార్చి 11న ​ ములుగు జిల్లాలో గవర్నర్ పర్యటన

మార్చి 11న ​ ములుగు జిల్లాలో గవర్నర్ పర్యటన

ములుగు/ తాడ్వాయి, వెలుగు : రాష్ర్ట గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ మంగళవారం ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. దత్తత గ్రామమైన తాడ్వాయి మండలం కొండపర్తిలో పర్యటించి చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి గ్రామస్తులతో ఇంటరాక్ట్ కానున్నారు. కొమరం భీమ్, బిర్సాముండా విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్​ దివాకర కలెక్టరేట్ లో అడిషనల్​ కలెక్టర్ మహేందర్​ జీ, సంపత్ రావు, డీఎస్పీ రవీందర్​తో కలిసి జిల్లా అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

గవర్నర్​ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గవర్నర్ కొండపర్తి పర్యటన అనంతరం మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేశ్, అన్ని శాఖల జిల్లా అధికారులు, ములుగు, తాడ్వాయి మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీవోలు తదితరులు పాల్గొన్నారు.