తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా

తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. గవర్నర్ గా రాజీనామా చేయటానికి కారణం.. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటమే. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో.. సొంత రాష్ట్రం అయిన తమిళనాడు నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. చెన్నై సెంట్రల్ నుంచి లోక్ సభకు పోటీ చేయటానికి లైన్ క్లియర్ కావటంతో.. తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు.

కొంత కాలంగా గవర్నర్ పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు బీజేపీ హైకమాండ్ తోనూ చర్చిస్తూ వస్తున్నారు. అయితే సరైన సమయం కోసం వేచి ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రెండు రోజులకే తన రాజీనామాకు లైన్ క్లియర్ అయ్యింది. తమిళిసై గతంలోనూ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. తెలంగాణ గవర్నర్ పదవి కంటే ముందే.. ఆమె తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా కూడా వ్యవహరించారు. 

మొదటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలపై ఆసక్తి ఉన్న తమిళిసై.. చాలా సందర్భాల్లో తన పొలిటికల్ ఎంట్రీపై సంకేతాలు ఇస్తూ వచ్చారు. ఎట్టకేలకు గవర్నర్ పదవికి రాజీనామా చేసి.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళుతున్నారు తమిళిసై..

ALSO READ | తెలంగాణ ఇంచార్జి గవర్నర్ గా.. ఏపీ గవర్నర్