
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాలను ఒక్కపూటనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి ఒక్కపూట నిర్వహించాలని అధికారులను మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శుక్రవారం ఆదేశించారు. ఉదయం 8 నుంచి 12:30 గంటల వరకు అంగన్‌వాడీ కేంద్రాలు నడవనున్నాయి.
అదే విధంగా మే 1 నుంచి 15 రోజులు టీచర్, ఆ తర్వాత 15 రోజులు ఆయాలు అటెండ్ కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు ఇవ్వనున్నారు. కాగా, రాష్ట్రంలోమొత్తం 35,700 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, వాటిల్లో 17 లక్షల 12 వేల మంది పిల్లలు ఉన్నారు.