
- పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో విద్యుత్తు శాఖకు పెద్ద మెత్తంలో నిధులు కేటాయించడంపై పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. మునుపెన్నడూ లేని విధంగా రూ.21,221 కోట్లు కేటాయించడాన్ని స్వాగతిస్తూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రత్నాకర్ రావు, సెక్రటరీ జనరల్ సదానందం గురువారం సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు.