- రెవెన్యూ శాఖ ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించింది. ములుగులోని సర్వే నంబర్ 837/1లో 211.26 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రూ.10.58 కోట్లు విలువ చేసే భూమిని యూనివర్సిటీకి ఉచితంగా కేటాయిస్తున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
భూమి కేటాయింపుకు సంబంధించి సెప్టెంబరు 10న ములుగు కలెక్టర్ రాసిన లేఖను పరిగణనలోకి తీసుకుని చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టారని, వాటిని పరిశీలించి భూమిని కేటాయిస్తున్నామని తెలిపారు.