తెలంగాణలో స్కూల్స్కు వరుసగా మూడు రోజులు సెలవులు

తెలంగాణలో స్కూల్స్కు వరుసగా మూడు రోజులు సెలవులు

హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం ఏప్రిల్ 12 నుంచి ఏప్రిల్ 14 వరకూ సెలవులు ప్రకటించింది. ఏప్రిల్ 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న సోమవారం అంబేద్కర్​ జయంతి కలిపి వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో పిల్లలతో సమ్మర్ వెకేషన్కు పేరేంట్స్ ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 18న గుడ్ ఫ్రైడే కావడంతో స్కూళ్లు, కాలేజీలకు ఆ రోజు కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

Also Read : మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడు

ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎండల నేపథ్యంలో రాష్ట్రంలోని స్కూళ్లు ఒక్కపూటనే నడుస్తున్నాయి. మార్చి 15 నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ స్కూళ్లు నడుస్తున్న విషయం విదితమే. తెలంగాణలో టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు ఇప్పటికే పూర్తయిన సంగతి తెలిసిందే.