గల్ఫ్ ఎక్స్​గ్రేషియా నిధుల విడుదలకు సీఎం ఆదేశాలు

గల్ఫ్ ఎక్స్​గ్రేషియా నిధుల విడుదలకు సీఎం ఆదేశాలు
  • మినరల్ ​డెవలప్​మెంట్ కార్పొరేషన్​ చైర్మన్​ అనిల్ ఈరవత్రి

హైదరాబాద్, వెలుగు: గల్ఫ్​లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున ఎక్స్​గ్రేషియా చెల్లించనుంది. ఈ మేరకు113 బాధిత కుటుంబాలకు వెంటనే నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావును ఆదేశించారని తెలంగాణ ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మైనింగ్ శాఖపై సమీక్ష నిర్వహించిన సందర్బంగా అనిల్ ఈరవత్రి గల్ఫ్ కార్మికులకు ఎక్స్ గ్రేషియా చెల్లించే అంశాన్ని సీఎం దృష్టికి తీసికెళ్లారు. 

వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి నిధుల విడుదలకు ఆదేశాలిచ్చారు. దీంతో సీఎం, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్ గౌడ్,  ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు డా.ఆర్.భూపతి రెడ్డి, ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మేడిపల్లి సత్యంతో పాటు సహకరించిన నాయకులు, గల్ఫ్ కార్మిక నేతలకు టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.