యూనిట్ కరెంట్ ను కేసీఆర్ రూ.10 కొంటే.. రేవంత్ రూ.5కే కొంటున్నారు

తెలంగాణలో కరెంట్ వినియోగం భారీగా పెరిగింది. పోయినేడాది మార్చితో పోలిస్తే ఈసారి మార్చిలో సగటున కోటిన్నర యూనిట్ల దాకా వాడకం ఎక్కువైంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిరోజు 300 మిలియన్ యూనిట్లకు పైనే కరెంట్ సరఫరా జరుగుతున్నది. 

కరెంట్ కు ఫుల్ డిమాండ్ ఉన్నప్పటికీ, డిమాండ్ కు సరిపడా మన డిస్కమ్స్ సరఫరా చేస్తున్నాయి. అంతేకాకుండా కరెంట్ వినియోగం భారీగా పెరిగినా, కొనుగోలు ఖర్చు మాత్రం సగానికి తగ్గింది. ఇదంతా పవర్ బ్యాంకింగ్ పాలసీతోనే సాధ్యమవుతున్నది. మన దగ్గర కరెంట్ తక్కువున్నప్పుడు ఇతర రాష్ట్రాల దగ్గరి నుంచి సేకరించడం, మన దగ్గర కరెంట్​ఎక్కువున్నప్పుడు ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయడమే పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాలసీ విధానం.

ALSO READ | కుట్రలు తిప్పి కొడ్తం : సీఎం రేవంత్ రెడ్డి

ఇప్పుడీ పాలసీ మన రాష్ట్రంలో అమలవుతున్నది. దీని ఆధారంగా హర్యానా, ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి కరెంట్ సేకరిస్తున్నారు. గతంలో ఇలా పీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నప్పుడు ఒక్కో యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు రూ.10 ఖర్చు చేసేవారు. ఇప్పుడు పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాలసీని అమలు చేస్తుండడంతో యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కరెంట్ ను రూ.5కే కొనుగోలు చేస్తున్నారు. దీంతో కరెంటు వినియోగం భారీగా పెరిగినా, ఖర్చు భారం సగానికి తగ్గిందని డిస్కమ్ వర్గాలు అంటున్నాయి. కొత్త పాలసీతో డిమాండ్ కు సరిపడా కరెంటు సరఫరా చేయగులుతున్నామని చెబుతున్నాయి.