
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. భవన్ రెసిడెంట్ కమిషనర్ (ఆర్సీ) గౌరవ్ ఉప్పల్.. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నిరాండబరమైన వ్యక్తిత్వంతో శ్రీపాదరావు స్పీకర్ పదవికే వన్నె తెచ్చారని కొనియాడారు. ప్రజాప్రతినిధిగానే కాకుండా న్యాయవాదిగానూ ప్రజలకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.